పలువురు అమ్మాయిలను వేధించడంతో పాటు వారిని నగ్నంగా వీడియోలు తీసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్ సాయి వల్ల పవిత్రమైన దర్గాకు అపవిత్రత కలుగుతుందని నటి లావణ్య ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. లావణ్య తరపున ఆమె న్యాయవాది నాగూర్ బాబు లేఖ రాశార. మస్తాన్ సాయి వల్ల మస్తాన్ బాబా దర్గాకు అపవిత్రత కలుగుతోందని పేర్కొన్నారు. గుంటూరులోని మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబ సభ్యులను తొలగించాలని కోరారు. ఈ లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, మైనార్టీ సంక్షేమ శాఖకు పంపించారు.
సినీ హీరో రాజ్ తరుణ్, నటి లావణ్యల మధ్య నెలకొన్న వివాదం సినీ పరిశ్రమలో దుమారం రేపిన విషయం తెల్సిందే. ఈ కేసులో మస్తాన్ సాయి నిందితుడుగా ఉన్నారు. ఇప్పటికే సాయిపై మహిళల న్యూడ్ ఫోటోలు తీయడం, అత్యాచారం, డ్రగ్స్ ఇలా అనేక రకాలైన కేసులు నమోదైవున్నాయి. ఈ కేసుల్లో మస్తాన్ సాయిని అరెస్టు చేయగా, పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వివాదంలో చిక్కుకోవడంతో హీరో రాజ్ తరుణ్ సినీ కెరీర్ నాశనమైన విషయం తెల్సిందే.