సినీ హీరో రాజ్ తరుణ్ - లావణ్య కేసులో అరెస్టయిన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో అనేక విషయాలను పోలీసులకు వెల్లడించారు. లావణ్యను హత్య చేసేందుకు అతడు పథకం పన్నినట్టు పేర్కొన్నాడు. యువతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతనిపై పోలీసులు ఎన్డీపీఎస్ సెక్షన్‌ను కూడా ప్రయోగించారు.
ఈ రిమాండ్ రిపోర్టులో మస్తాన్ సాయి సంచలన విషయాలును బహిర్గతం చేశారు. మస్తాన్ సాయి, అతని స్నేహితుడు ఖాజాకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసినట్టు మస్తాన్ సాయి వెల్లడించాడు. లావణ్య, మస్తాన్ సాయి మధ్య గతంలోనే హీరో రాజ్ తరుణ్ సయోధ్య కుదిర్చారు.
అపుడే మస్తాన్ సాయి ల్యాప్ టాప్‌లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్ తరుణ్ డిలీట్ చేయించారు. అయితే, అప్పటికే ఆ వీడియోలను ఇతర డివైజ్‌లోకి మస్తాన్ సాయి కాపీ చేసుకున్నాడు. హార్డ్ డిస్క్ కోసం లావణ్యను చంపేందుకు మస్తాన్ ప్లాన్ పక్కా ప్లాన్ వేసి గత జనవరి 30వ తేదీన లావణ్య ఇంటికి వెళ్లి ఆమెపై హత్యాయత్నానికి పాల్పడినట్టు వెల్లడించాడు.