Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్... అడ్డంగా దొరికిన ఆ ఇద్దరు (Video)

Advertiesment
Raj Tarun's Ex-Lover Lavanya

ఠాగూర్

, శనివారం, 7 సెప్టెంబరు 2024 (09:22 IST)
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ - లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. లావణ్యతో పదేళ్లపాటు సహజీవనం చేసిన రాజ్ తరుణ్ ఇపుడు కుర్ర హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ప్రేమ పేరుతో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తనకు మాల్వీకి ఎలాంటి సంబంధం లేదనీ, తామిద్దరం కేవలం ఒక హీరో హీరోయిన్లు మాత్రమేనంటూ వారిద్దరూ అడ్డంగా బుకాయిస్తూ వచ్చారు. ఈ క్రమంలో రాజ్ తరుణ్‌, మాల్వీ మల్హోత్రాలు ఓ గదిలో ఏకాంతంగా కనిపించి అడ్డంగా బుక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
రాణ్ తరుణ్ నిందితుడే.. పోలీసుల చార్జిషీట్ 
 
హీరో రాజ్‌తరుణ్ నిందితుడేనని, అందువల్ల ఓ యువతి ఆయనపై చేసిన ఆరోపణలకు సంబంధించి చార్జిషీటును తయారు చేసి దాఖలు చేసినట్టు తెలిపారు. పదేళ్లపాటు తనతో సహజీవనం చేసి, మరో హీరోయిన్ మోజులోపడి తన నుంచి వెళ్లిపోయాడంటూ హీరో రాజ్‍‌తరుణ్‌పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఆమె ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
తాజాగా లావణ్య ఆరోపణల్లో నిజం ఉందని పేర్కొన్న పోలీసులు.. చార్జిషీటు తయారు చేశారు. రాజ్‌తరుణ్‌పై పోలీసులు చార్జిషీట్ చేయడం పట్ల లావణ్య స్పందించారు. రాణ్ తరుణ్‌పై చార్జిషీట్ శుభపరిణామం అని వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం జరిగిందని, తాను న్యాయం కోసం పోరాడుతున్నట్టు స్పష్టం చేశారు. తనపై ఎన్నో నిందలు వేశారని, చివరకు న్యాయమే గెలుస్తుందని తెలిపారు. 
 
రాజ్ తరుణ్ వెళ్లిపోయాక మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానని లావణ్య వెల్లడించారు. రాజ్ తరుణ్, తాను పదేళ్ల పాటు  సంసారం చేశామన్నది వాస్తవం అని తెలిపారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ పోలీసులకు ఇచ్చానని చెప్పారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యు.ఎస్‌లో 500K డాల‌ర్స్ ప్రీ సేల్స్‌ను దాటేసిన ఎన్టీఆర్ ‘దేవర’