Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత నిర్లక్ష్యం చేస్తున్నాడనీ భర్తను చంపేసిన భార్య!

ఠాగూర్
శనివారం, 2 ఆగస్టు 2025 (11:35 IST)
ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత తనను నిర్లక్ష్యం చేస్తూ పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరు నగర శివారు ప్రాంతమైన బూదగుంప గ్రామానికి చెందిన ద్యావన్నకు మొదటి భార్య ద్వారా ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్యను నిర్లక్ష్యం చేస్తూ, పొరుగు గ్రామం కామనూరుకు చెందిన నేత్రావతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏడాది కిందట ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే, వివాహమయ్యే సమయానికే నేత్రావతికి అదే గ్రామానికి చెందిన శ్యామన్న అనే వ్యక్తితోనూ వివాహేతర సంబంధం ఉంది. వివాహమైన అనంతరం ద్యావన్నను తనను పట్టించుకోవడం లేదని, హత్య చేస్తే శ్యామన్నతో కలిసి ఉండవచ్చని భావించింది.
 
బూదగుంపలో ఒక గ్యారేజ్ నుంచి తీసుకు వచ్చిన ఇనుప రాడ్‌తో ద్యావన్నపై ఇంట్లో జులై 25న దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని ఇంటి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి రాత్రికి రాత్రి కాల్చేశారు. భర్త ఫోనును ఆమె స్విచాఫ్ చేసింది. నీ భర్త ఎక్కడ అని అడిగిన వారందరికీ ధర్మస్థలకు వెళ్లాడని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసింది. 
 
అయితే, శ్యామన్నతో కలిసి నాగపంచమి ఆచరించుకోవడం, ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను అదుపులోనికి తీసుకుని విచారణ చేయగా, జరిగిన ఘటనపై నోరు విప్పింది. శ్యామన్నను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments