Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలంటీర్ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (10:49 IST)
ఏపీలో వివాహేతర సంబంధం ఓ వాలంటీర్ ప్రాణం తీసింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వార్డు వలంటీరును ఆమె భర్త హత్య చేశాడు. ఈ సంఘటన ఆదివారం కడప జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కడప నగరం నిరంజన్ నగర్‌కు చెందిన చిట్వేలి భవానీశంకర్ (30), అతడి భార్య బాబాబీలు నిరంజన్ నగర్ 13, 14 వార్డుల వలంటీర్లుగా పనిచేస్తున్నారు. 
 
అలాగే, కడపకు చెందిన గుజ్జుల మల్లికార్జున జీవిత బీమా కార్యాలయంలోని ఈడీఎంఎస్‌లో డేటా డిజిటలైజేషన్ టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నారు. ఇదే బృందంలోని మల్లికార్జున భార్య శైలజతోపాటు, ఔట్ సోర్సింగ్ పద్ధతిన వలంటీర్ భవానీ శంకర్ కూడా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శైలజ, భవానీశంకర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న మల్లికార్జున శనివారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. భవానీశంకర్‌ను హత్య చేసి పగ తీర్చుకోవాలని పథకం రచించాడు. 
 
తన స్నేహితుడైన రంజిత్ కుమార్ అనే ఆటోడ్రైవర్‌తో కలసి ఆదివారం ఉదయం 9 గంటలకు భవానీశంకర్‌కు ఫోన్ చేసి ఎల్బీసీ కార్యాలయంలోని వీరి ఆఫీసుకు పిలిపించుకున్నారు. భవానీ శంకర్ వచ్చీరాగానే అతడి మెడపై కత్తితో నరికి అక్కడి నుంచి పారిపోయారు. 
 
తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిన భవానీ శంకర్ అక్కడికక్కడే కన్నుమూశాడు. కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, వన్ టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐ రంగస్వామి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితులను ఆదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments