Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కడపలో బిగ్‌వింగ్‌ షోరూమ్‌ను ప్రారంభించిన హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా

Advertiesment
image
, శనివారం, 21 అక్టోబరు 2023 (22:48 IST)
దేశవ్యాప్తంగా ప్రీమియం మోటర్‌సైకిల్‌ వినియోగదారులకు వైవిధ్యమైన రీతిలో లీనమయ్యే అనుభవాలను అందిస్తున్న హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఎస్‌ఐ) నేడు తమ ప్రీమియం బిగ్‌ బైక్‌ అమ్మకాలు, సేవల ఔట్‌లెట్‌ హోండా బిగ్‌వింగ్‌‌ను కడప  (ఆంధ్రప్రదేశ్‌)లో ప్రారంభించింది. ట్రంక్ రోడ్, ఆల్మాస్ పేట, కడప వద్ద వున్న ఈ ఫెసిలిటీ సంభావ్య వినియోగదారుల వద్ద తమ గో-రైడింగ్‌ స్ఫూర్తిని మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకుంది.
 
ఔత్సాహిక వినియోగదారుల చివరి మైలు అవసరాలను తీర్చటంలో భాగంగా, విభిన్నమైన బిగ్‌వింగ్‌ను 130 కంటే ఎక్కువ కార్యాచరణ టచ్‌పాయింట్‌లలో అనుభవించవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో కడప అవుట్‌లెట్ ప్రారంభించిన తర్వాత, కంపెనీ ఇప్పుడు HMSI నుండి అద్భుతమైన ప్రీమియం ఆఫర్‌లతో మొత్తం 8 అవుట్‌లెట్‌లను నిర్వహిస్తోంది.
 
ప్రీమియం అనుభవాలు :
బ్లాక్‌ అండ్‌ వైట్‌ మోనోక్రోమాటిక్‌ నేపథ్యంతో ఆకట్టుకునేలా ఉన్న బిగ్‌వింగ్‌, తాము ప్రదర్శించే వాహనాలను పూర్తి వైభవంగా ప్రదర్శిస్తుంది. ఉత్పత్తికి సంబంధించి వినియోగదారులకు ఉన్న సందేహాలు తీర్చడం లేదా యాక్ససరీలను సుశిక్షితులైన, విజ్ఞానవంతులైన ప్రొఫెషనల్స్‌ బిగ్‌వింగ్‌ వద్ద అందిస్తారు. వెదకడం మొదలు కొనుగోలువరకూ ప్రయాణాన్ని సులభతరం చేస్తూ, పూర్తిగా అంకితం చేసిన వెబ్‌సైట్‌ HondaBigWing సవివరమైన సమాచారం అందిస్తుంది. వెబ్‌సైట్‌పై ఆన్‌లైన్‌ బుకింగ్‌ అవకాశం, వేగవంతమైన, సులభసాధ్యమైన, పారదర్శక బుకింగ్‌ అనుభవాలను వినియోగదారుల మునివేళ్లపై అందిస్తుంది. వాస్తవ సమయంలో వినియోగదారుల అభిప్రాయాలను ఒడిసిపట్టుకునేందుకు, హోండా బిగ్‌వింగ్‌ ఇప్పుడు అన్ని సామాజిక మాధ్యమ వేదికలపై లభ్యమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్కెట్లోకి వన్‌ప్లస్ 'ఓపెన్' ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌.. భారత్‌లో ధరెంత?