Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గూఢచర్యం ఆరోపణలు : 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు మరణశిక్ష

Advertiesment
court
, గురువారం, 26 అక్టోబరు 2023 (22:33 IST)
గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో భారత్‌కు చెందిన ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణశిక్ష విధిస్తూ గురువారం సంచలన తీర్పును వెలువరించింది. ఈ ఎనిమిది మంది అధికారులు కొన్ని నెలలుగా ఖతార్ నిర్బంధంలో ఉన్నారు. తాజాగా వీరికి అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. గూఢచర్యం ఆరోపణలపై వీరికి ఈ శిక్ష పడినట్లు సమాచారం. మరోవైపు, ఈ 8 మంది భారతీయులకు మరణశిక్ష పడినట్లు వార్తలు రావడంపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఈ వార్త తమనెంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలిపింది. 
 
'నేవీ మాజీ అధికారులకు ఖతర్ కోర్టు మరణశిక్ష విధించిందన్న విషయం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ తీర్పునకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వేచిచూస్తున్నాం. బాధితుల కుటుంబ సభ్యులతోపాటు న్యాయ బృందంతో టచ్‌లో ఉన్నాం. చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాల కోసం అన్వేషిస్తున్నాం. ఈ కేసుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం. ఈ తీర్పునకు సంబంధించిన విషయాన్ని ఖతర్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం' అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. గోప్యతకు సంబంధించిన కారణాల దృష్ట్యా ఈ కేసుపై ప్రస్తుతం ఎక్కువగా వ్యాఖ్యానించలేమని తెలిపింది.
 
కాగా, ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, భారత్‌కు ఈ అధికారులు.. అల్ దహ్రా సంస్థ‌లో పనిచేస్తున్నారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళం అధికారి నిర్వహిస్తున్నారు. అయితే, భారత్‌కు చెందిన ఈ 8 మందిని ఖతర్ అధికారులు ఆగస్టు 2022లో నిర్బంధంలోకి తీసుకున్నారు. సబ్‌మెరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని నిర్బంధించారు. 
 
అయితే, వీరంతా భారత అధికారులతో మాట్లాడేందుకు ఖతార్ అనుమతి ఇచ్చింది. దీంతో భారత విదేశాంగ శాఖ అధికారులు కలవడంతోపాటు ఖతార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. అదేసమయంలో పలుమార్లు బెయిలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వీరి నిర్బంధాన్ని ఖతర్ ప్రభుత్వం పొడిగించింది. చివరకు ఈ కేసు కోర్టులో విచారణకు వెళ్లింది. ఈ క్రమంలోనే వీరందరికీ అక్కడి న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఆర్పీ ద్వారా పాముకు ప్రాణం పోసిన పోలీస్ కానిస్టేబుల్