Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

ఠాగూర్
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (08:22 IST)
అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన టెక్ ఎంటర్‌ప్రెన్యూయర్ ఒకరు తన భార్యను, కుమారుడుని తుపాకీతో కాల్చి చంపేసి, ఆ తర్వాత తాను కూడా అదే తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్‌ రాష్ట్రంలోని న్యూకాజిల్ పట్టణంలోని వారి నివాసంలోనే ఏప్రిల్ 24వ తేదీన ఈ విషాదకర ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, మృతులను హర్ష వర్ధన్ ఎస్ కిక్కేరి (57), ఆయన భార్య శ్వేతా పాణ్యం (44), వారి 14 యేళ్ల కుమారుడుగా గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో వీరి మరో కుమారుడు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలు నిలిచాయి. హర్షవర్థన్ తొలుత భార్యను, ఆ తర్వాత కుమారుడున కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అదే తుపాకీతో తాను కూల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
ఈ దారుణానికి పాల్పడటానికి స్పష్టమైన కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని కింగ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. ఆ కుటుంబం అందరితో స్నేహంగానే మెలిగేదని, అయితే తమ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా ఇతరులతో పంచుకునేవారు కాదని పొరుగువారు చెప్పినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments