Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

Advertiesment
couple

ఐవీఆర్

, ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (21:25 IST)
వివాహేతర సంబంధం ఓ చిన్నారి ప్రాణాన్ని తీసేసింది. మంచినీళ్లు అడిగిన చిన్నారికి తమ శృంగార సుఖానికి అడ్డు వస్తుందని మద్యం తాగించారు. దాంతో ఆ చిన్నారి మృతి చెందింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లాలోని వెటియాయన్విలై సమీపంలో శరత్, బృంద నివాసముంటున్నారు. వీరికి రెండున్నర సంవత్సరాల పాప వుంది. శరత్-బృంద ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఐతే బృంద తన పుట్టిన ఊరులో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా కానించేస్తోంది.
 
ఈక్రమంలో ప్రియుడు ఈ నెల 23వ తేదీన తన కోర్కె తీర్చాలని ఫోన్ చేసాడు. దీనితో తన బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లి వస్తానని భర్త శరత్‌తో చెప్పి వచ్చేసింది. అదేరోజు అర్థరాత్రి సమయంలో బృంద తల్లి గాఢ నిద్రలో వుండగా బృంద ప్రియుడు రహస్యంగా వచ్చాడు. ఆమెను తన వెంట రావాల్సిందిగా కోరాడు. దీనితో బృంద తన కుమారుడుని తీసుకుని అతడి బైక్ ఎక్కింది. అతడు సమీపంలో వున్న అరటి తోటకు తీసుకుని వెళ్లాడు. అక్కడ అప్పటికే బృంద ప్రియుడి స్నేహితులు మరో ఇద్దరు వున్నారు. వీరంతా పూటుగా మద్యం సేవించి వున్నారు. తొలుత బృంద ప్రియుడు ఆమెతో రాసలీల సాగించాడు. అనంతరం తన స్నేహితుల కోర్కె తీర్చమని అడిగాడు.
 
ఆ సమయంలో బృంద రెండున్నరేళ్ల కుమారుడు తనకు మంచినీళ్లు కావాలంటూ నిద్ర లేచాడు. తమ రాసలీలకు చిన్నారి అడ్డు వస్తున్నాడని అతడికి మంచినీళ్లలో మద్యం కలిపి తాగించారు. అతడు అరవకుండా గట్టిగా నోరు మూసారు. దాంతో పిల్లవాడు మత్తులోకి జారుకున్నాడు. ఇక బృంద ప్రియుడుతో పాటు అతడి స్నేహితులు ఇద్దరూ వంతులవారీగా బృందతో గడిపారు. తెల్లవారుతుందనగా బృంద తన బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చింది. తెల్లవారాక బిడ్డ ఎంతకీ నిద్ర లేవలేదు. కారణం ఏంటని బృంద తల్లి అడిగితే.... రాత్రి మంచం పైనుంచి కింద పడ్డాడు అంటూ అబద్దం చెప్పింది.
 
దీనితో అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లి పరీక్ష చేయగా అప్పటికే అతడు మృతి చెందాడు. శవ పరీక్ష చేసిన రిపోర్టులో వాస్తవాలు మరో రకంగా వుండటంతో పోలీసులు తమదైన శైలిలో బృంద వద్ద విచారించగా నిజాన్ని అంగీకరించింది. బృందతో పాటు ఆమె ప్రియుడు, అతడి ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేసారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)