Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకుతో కలిసి భర్త గొంతుకోసిన మూడో భార్య!

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (11:41 IST)
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. కుమారుడుతో కలిసి మూడో భార్య తన భర్త గొంతుకోసింది. చున్నీతో కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి గొంతుకోశారు. బండ్లగూడ రాణా పరిధిలో మంగళవారం ఉదయం ఈ హత్య జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, 
 
బంజారాహిల్స్‌కు చెందిన మసీయుద్దీన్ (57) అనే రియల్టర్ కొన్నేళ్ల క్రితం షబానా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. మసీయుద్దీన్‌కు ఇది మూడో పెళ్లి కాగా, షబానాకు రెండో విషయం. షబానాకు అప్పటికే సమీర్ అనే కొడుకు ఉన్నాడు. బండ్లగూడలోని క్రిస్టల్ టౌన్‌షిప్‌లో మసీయుద్దీన్ అపార్టుమెంట్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న షబానాను, ఆమె కొడుకును అక్కడ ఉంచాడు. మసీయుద్దీన్ రోజూ వచ్చి వెళుతుండేవాడు. 
 
ఈ క్రమంలో సోమవారం మసీయుద్దీన్, షబానాకు మధ్య గొడవ పడింది. మంగళవారం ఉదయం మసీయుద్ధీన్ అపార్టుమెంట్‌కు వచ్చాడు. అప్పటికే అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్న షబానా, సమీర్‌తో పాటు అతడి స్నేహితుడు ఫరీద్ సాయంతో మసీయుద్దీన్‌పై దాడి చేసింది. 
 
చున్నీతో మసీయుద్దీన్ చేతులు, కాళ్లు కట్టేసింది. మసీయుద్ధీన్ అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. ఆపై గొంతుకోసి హతమార్చారు. మంగళవారం రాత్రి బండ్లగూడ ఠాణాకు పెళ్లి షబానా, సమీర్‌లు పోలీసుల ముందు లొంగిపోయారు. హత్యకు కారణాలేంటనే వివరాలు పోలీసులు వెల్లడించలేదు. అయితే, షబానాకున్న వివాహేతర సంబంధమే మసీయుద్దీన్ దారితీసిందని తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిల్క్ బ్యూటీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఏంటది?

నిద్రమాత్రలు మింగిన గాయని కల్పన ఆరోగ్యం ఎలావుంది? (Video)

ప్లీజ్ అలా పిలవొద్దంటున్న అగ్ర హీరోయిన్!!

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments