Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవ్ పార్టీలో చిక్కిన టెక్కీలను తొలగించిన టాప్ ఐటీ కంపెనీలు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (12:53 IST)
హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజాలోని ఫుడింగ్ అండ్ మింకీ జరిగిన రేవ్ పార్టీలో అనేక మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పాల్గొన్నట్టు తేలింది. దీంతో ఈ రేవ్ పార్టీతో సంబంధం ఉన్న వారినీ ఆయా కంపెనీలు తొలగిస్తున్నాయి. 
 
ఇటీవల జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ పబ్‌పై సోదాలు చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో అనేక మంది సినీ రాజకీయ ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారు. వీరిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా నోటీసులు ఇచ్చి పంపించారు. 
 
అలాగే, రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లైసెన్సును కూడా రద్దు చేసింది. అదేసమయంలో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. 
 
మరోవైపు, ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డ్రగ్స్ తీసుకుంటున్న ఉద్యోగులపై కఠిన చర్యలకు ఉపక్రమించాయి. మత్తు పదార్థాలకు బానిసలైన ఉద్యోగులపై వేటు వేశాయి. తాజాగా 13 మంది ఐటీ ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది ఉద్యోగులకు నోటీసులు ఇచ్చాయి. 
 
పైగా, పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ పెడ్లర్ల వద్ద ఐటీ ఉద్యోగుల జాబితా ఉంది. దీంతో వీరి పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ వాడిన ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, మహీంద్రా క్యూసాఫ్ట్ ఉద్యోగులకు పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్ ఫెడ్లర్ టోనీ, ప్రేమ్ కుమార్, లక్ష్మీపతిల వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments