Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ రాష్ట్రంలో 4 గంటల వ్యవధిలో ఐదుగురు ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (12:01 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో నాలుగు గంటల వ్యవధిలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జెంషెడ్‌పూర్‌లో ఈ విషాదకర ఘటన జరిగింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఐదు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
మృతుల్లో ఒక చర్చి ఫాదర్ కూడా ఉండటం గమనార్హం. నగరంలో జరిగిన వరుస ఆత్మహత్యల దృష్ట్యా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కారణాలు తెలుసుకునే పనిలో పడింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసులను ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
 
జంషెడ్‌పూర్‌ నగరంలోని పలు పోలీస్​ స్టేషన్ల పరిధిలో ఈ ఐదు ఆత్మహత్యలు వెలుగు చూశాయి. సూసైడ్​ చేసుకున్న వారిలో గొల్మూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్చి ఫాదర్ లియో జాన్ డిసౌజా(52) కూడా ఉన్నాడు. బుధవారం ఆయన తన గదిలో ఉరివేసుకున్నారు. 
 
మరోవైపు బిర్సానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిలీప్(46) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కమల్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంకుచియాకు చెందిన జలధార్(60) అనే వృద్ధుడు, బోడం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు, సక్చి పోలీస్ స్టేషన్ సమీపంలోని రాంలీలా మైదాన్​కు చెందిన సంజయ్​ శర్మ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన వారిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments