Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెత్త పన్నుతో మాజీ మంత్రి కొడాలి నానికి తలనొప్పి..

kodali nani
, బుధవారం, 27 జులై 2022 (11:17 IST)
చెత్త పన్నుపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి చేదు అనుభవం ఎదురైంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక.. ఓ సారి సీఎంను కలుద్దాం అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. కొడాలి నాని సొంత నియోజకవర్గం గుడివాడలో మంగళవారం "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
నాని పర్యటనలో స్థానిక మహిళల తమ సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. చెత్త పన్ను చెల్లింపు భారంగా ఉందని.. అద్దెకు ఉంటున్నవారు చెల్లించాలని వాలంటీర్లు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. వెంటనే స్పందించిన నాని.. మున్సిపల్‌ అధికారుల్ని పిలిచి చెత్త పన్ను వసూలు చేయొద్దని చెప్పినా.. మళ్లీ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
 
అందుకు చెత్త పన్ను వసూళ్లలో గుడివాడ రాష్ట్రంలోనే మంచి స్థానంలో ఉందని అధికారి బదులిచ్చారు. నెలకు ఎంత వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి ప్రశ్నించగా.. సుమారుగా రూ. 16లక్షలు టార్గెట్ ఉంటే.. రూ.14 లక్షలు వసూలవుతోందని చెప్పారు. 
 
ఈ మాత్రానికి ప్రజలపై భారం వేయడం సరికాదని.. ఇకపై చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. వెంటనే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానితో కలిసి సీఎంను కలుస్తామన్నారు. 
 
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్త పన్నుపై సొంత పార్టీ నేతలే అసహసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటంతో వైసీపీ నేతలు వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడులో మరో స్కూల్ విద్యార్థిని ఆత్మహత్య