Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనల్లుడిని చంపి బాడీని ముక్కలు చేసిన మేనత్త... శరీర భాగాలను సిమెంట్‌తో పాతిపెట్టిన తండ్రి..

ఠాగూర్
బుధవారం, 4 జూన్ 2025 (08:45 IST)
'నా మేనల్లుడుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను... తనకు తెలియకుండానే సీక్రెట్‌గా ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలు చూపించి బెదిరింపులకు పాల్పడసాగాడు. ఈ వేధింపులు, టెన్షన్‌ను భరించలేక అతన్ని చంపేశాను' అని ఓ అత్త పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. తనతో సన్నిహితంగా ఉన్నపుడు తీసిన ప్రైవేట్ ఫోటోలను బహిర్గతం చేస్తానంటూ బెదిరించడంతో మేనల్లుడుని హత్య చేసినట్టు అత్త వెల్లడించింది. ఈ దారుణ హత్య వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని దినాజ్‌పూర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగాల్ రాష్ట్రంలోని మల్దా జిల్లాకు చెందిన సద్దా నదాబ్ అనే యువకుడు కాంట్రాక్టు కూలీగా పనిచేస్తున్నాడు. మే నెల 18వ తేదీ నుంచి అతడు కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళనకుగురైన అతని కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 
వారి ప్రాథమిక దర్యాప్తులో సద్దా సదాబ్‌కు వరుసకు అత్త అయిన మౌమితా హాసన్ ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు. ఈ కోణలో దర్యాప్తు చేసిన పోలీసులు మమితా హాసన్‌ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించారు. దీంతో ఆమె అసలు నిజాన్ని బయటపెట్టింది. సద్దా నదాబ్ తన వ్యక్తిగత ఫోటోలను బయటపెడతానంటూ పదేపదే బెదిరిస్తున్నాడని, ఈ క్రమంలోనే అతడిని హత్య చేసినట్టు మౌమితా హాసన్ అంగీకరించారు. 
 
హత్య అనంతరం మృతదేహాన్ని మూడు ముక్కులుగా నరికినట్టు మౌమిత చెప్పడంతో పోలీసులు షాకియ్యారు. ఆపై తన తండ్రి ఇంట్లో ఆ మృతదేహం ముక్కలను సిమెంట్‌తో పాతిపెట్టినట్టు చెప్పింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెప్పిన ప్రదేశంలో తవ్వకాలు జరుపగా సద్దా నదాబ్ మృతదేహం ముక్కలు బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిని అరెస్టు పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments