Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులను అక్కడా ఇక్కడా టచ్ చేస్తూ.. యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (18:04 IST)
తెలంగాణా రాష్ట్రంలో చైత్ర అత్యాచారం, హత్య ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఆందోళన రేకిత్తిస్తోంది. ముక్కుపచ్చలారని ఆరేళ్ళ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా అతి క్రూరంగా చంపేశాడు కామాంధుడు. ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 
అయితే ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా కామాంధులు కఠినంగా శిక్షించినా మార్పు మాత్రం కనిపించడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. చిన్నపిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తానని చెప్పి వారి ప్రైవేటు ప్లేస్‌ను తాకుతూ కామవాంఛ తీర్చుకునే ఒక కామాంధుడి బాగోతం బయటపడింది.

 
గత నెలరోజులుగా ఇలా కాలనీలోని చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట ప్రాంతంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముండే అనిల్ అనే 20 యేళ్ళ యువకుడు ఐదేళ్ళ నుంచి పదేళ్ళ లోపు చిన్నారులకు చాక్లెట్లు తీసిస్తూ వారిని కాలనీ చివరి ప్రాంతానికి తీసుకెళ్ళి వారితో అసభ్యంగా ప్రవర్తించాడు.

 
తమను ఏం చేస్తున్నాడో తెలుసుకోలేని వయస్సులో ఉన్న ఆ చిన్నారులు చాక్లెట్లు తింటూ ఆ తరువాత ఇంటికి వెళ్ళిపోయేవారు. అయితే నిన్న సాయంత్రం చిన్నారులతో ఆ కామాంధుడు ఉండటాన్ని గమనించారు స్థానికులు. కోపంతో ఊగిపోయారు. అనిల్‌ను కరెంట్ స్తంభానికి కట్టి చితకబాదారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. విచారణలో తను నెలరోజులుగా చిన్నారులతో ఆవిధంగా ప్రవర్తిస్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments