పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

ఐవీఆర్
మంగళవారం, 21 అక్టోబరు 2025 (23:12 IST)
రాజమండ్రిలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను హాస్టల్ నుంచి బైటకు తీసుకెళ్లి అత్యాచారం చేసాడు. బాధితురాలు రాజమండ్రి టూటౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
రాజమండ్రిలో వున్న ఓ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం హాస్టలులో వుండి చదువుకుంటున్న విద్యార్థిని సోమవారం నాడు సాయంత్రం తన అన్నయ్య వచ్చాడనీ, బైటకెళ్లి వస్తువులు కొనుక్కోవాలని వార్డెన్‌కి చెప్పి వెళ్లింది. ఐతే వచ్చిన యువకుడు బాలికను తన వాహనంపైన ఎక్కించుకుని గోదావరి గట్టుపైకి తీసుకెళ్లాడు.
 
అక్కడ మరో యువకుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమెను రాజమండ్రి రైల్వే స్టేషనులో వున్న ఓ లాడ్జికి తీసుకుని వెళ్లాడు. ఆ లాడ్జి గదిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలిని దేవిచౌక్ లో దింపేసి వెళ్లిపోయాడు. నిందితుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకి చెందిన అజయ్ గా పోలీసులు గుర్తించారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments