Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణె వేదికగా ఇంగ్లండ్‌ వన్డే వార్... జోరుమీదున్న భారత్...

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (08:22 IST)
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మంగళవారం నుంచి వన్డే వార్ మొదలుకానుంది. పూణె వేదికగా తొలి వన్డే మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్‌ను మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎమ్‌సీఏ) స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా జరుగనుంది. 
 
టెస్టు సిరీస్‌లో భాగంగా చివరి రెండు టెస్టులతో పాటు, ఐదు టీ20లను అహ్మదాబాద్‌లోనే ఆడిన టీమ్‌ఇండియా.. వన్డే సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లను ఇదే మైదానంలో ఆడనుంది. తొలి వన్డేకు ముందు యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌పైనే అందరి దృష్టి నెలకొంది. 
 
పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌లాంటి యువ ఆటగాళ్లు ఓపెనింగ్‌ స్థానంపై కన్నేయడంతో ధావన్‌ కెరీర్‌కు ఈ సిరీస్‌ కీలకం కానుంది. అలాగే, వరుస సిరీస్‌ విజయాలతో జోరుమీదున్న భారత జట్టు మరో కీలక సమరానికి సిద్ధమైంది. మరోవైపు వరుస ఓటములతో డీలాపడ్డ ఇంగ్లండ్‌.. తిరిగి పుంజుకొని వన్డే సిరీస్‌ చేజిక్కించుకోవాలిన కృతనిశ్చయంతో ఉంది.
 
మరోవైపు, టెస్టు సిరీస్‌లో పెద్దగా పోటీనివ్వలేకపోయిన ఇంగ్లండ్‌.. పొట్టి ఫార్మాట్‌లో సత్తాచాటింది. ఒకదశలో సిరీస్‌ చేజిక్కించుకునేలా కనిపించినా.. ఒత్తిడిని జయించడంలో విఫలమై పరాజయం వైపు నిలిచింది. అయితే ఆ ఓటములను పక్కనపెట్టి వన్డే సిరీస్‌ కోసం మోర్గాన్‌ సేన తాజాగా సిద్ధమవుతున్నది.
 
ఇదిలావుంటే, గత 2017, జనవరి 15.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య పుణె వేదికగా తొలి వన్డే జరిగింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. జాసన్‌ రాయ్‌ (73), జో రూట్‌ (78), బెన్‌ స్టోక్స్‌ (62) అర్థశతకాలతో రాణించగా.. మిగిలినవాళ్లు కూడా తలో చేయి వేయడంతో ఇంగ్లిష్‌ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా, జస్ప్రీత్‌ బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 
 
అనంతరం లక్ష్యఛేదనలో శిఖర్‌ ధావన్‌ (1), లోకేశ్‌ రాహుల్‌ (8), యువరాజ్‌ సింగ్‌ (15), మహేంద్రసింగ్‌ ధోనీ (6) విఫలమైనా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (105 బంతుల్లో 122; 8 ఫోర్లు, 5 సిక్సర్లు), కేదార్‌ జాదవ్‌ (76 బంతుల్లో 120; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో విజృంభించడంతో టీమ్‌ఇండియా 48.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లపై విరాట్‌ విరుచుకుపడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దితే.. లోకల్‌ బాయ్‌ కేదార్‌ జాదవ్‌ వీరవిహారంతో జట్టును గెలిపించడం విశేషం. అదే జోరులో రెండో వన్డే కూడా నెగ్గిన భారత్‌ సిరీస్‌ చేజిక్కించుకుంది.
 
 
ఇరు జట్ల తుది అంచనా
భారత్‌: విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శర్మ‌, శిఖర్ ధావన్‌, శ్రేయస్‌, రిషబ్ పంత్‌, రాహుల్‌/సుందర్‌, హార్దిక్‌, భువనేశ్వర్‌, శార్దూల్‌, చాహల్‌/కుల్దీప్‌, నటరాజన్‌.
 
ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), రాయ్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌, బట్లర్‌, బిల్లింగ్స్‌, అలీ, సామ్‌ కరన్‌, రషీద్‌, టాప్లే, వుడ్‌.
 
పిచ్‌, వాతావరణం
పుణె పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఈ మైదానంలో ఇప్పటివరకు నాలుగు వన్డేలు జరుగగా.. అందులో మూడుసార్లు మూడొందల పైచిలుకు పరుగుల లక్ష్యఛేదన సాధ్యమైంది. ఈ మ్యాచ్‌కు వర్ష ముప్పు లేదు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments