Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు - లాక్డౌన్ తప్పదా?

Advertiesment
భారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు - లాక్డౌన్ తప్పదా?
, సోమవారం, 22 మార్చి 2021 (10:42 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంద. ఈ క్రమంలో గ‌త‌ 24 గంట‌ల్లో 46,951 మందికి కరోనా నిర్ధారణ అయింది. 
 
వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... కొత్త‌గా 21,180 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,46,081కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 212 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,967 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,51,468  మంది కోలుకున్నారు. 3,34,646 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,50,65,998 మందికి వ్యాక్సిన్లు వేశారు.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,44,45,774 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,80,655 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
మరోవైపు, తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 337 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 181 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,455కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,826 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,671గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2,958 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,226 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 91 మందికి క‌రోనా సోకింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#WorldWaterDay2021: అబ్ధుల్ కలామే ఆ మాటన్నారు.. నీటిని రక్షించుకుందాం..!