Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తేనె తుట్టెకు నిప్పుపెట్టబోయి... సజీవదహనమైన యువకుడు...

Advertiesment
తేనె తుట్టెకు నిప్పుపెట్టబోయి... సజీవదహనమైన యువకుడు...
, ఆదివారం, 21 మార్చి 2021 (15:57 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మక్తల్‌ పట్టణంలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూల్ బస్సులోని తేనె తుట్టెకు నిప్పు పెట్టడంతో.. ప్రమాదవశాత్తూ మంటలంటుకొని సజీవదహనమయ్యాడు. 
 
కరోనా కారణంగా గత కొద్ది నెలలుగా బడులు మూతబడిన విషయం తెలిసిందే. దీంతో పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన బస్సులను ఖాళీ స్థలంలో పార్క్ చేశారు. యేడాదిగా వాటిని కదపకపోవడంతో ఓ బస్సులో తేనెటీగలు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. 
 
తేనెతుట్టెను గమనించిన బుడగజంగాల మహదేవ్‌(55), గోపిలు దాన్ని కొట్టేందుకు ప్రయత్నించాడు. పొగ పెడితే తేనెటీగలు పారిపోతాయని, అప్పుడు తేనెను సులభంగా తీసుకోవచ్చని మహదేవ్‌ బస్సులోకి వెళ్లి మంట వెలిగించాడు.
 
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బస్సుకే మంటలు అంటుకున్నాయి. భయపడిన గోపి అక్కడినుంచి పరిగెత్తాడు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న మరో రెండు బస్సులకూ మంటలు నిమిషాల వ్యవధిలో వ్యాపించాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి వచ్చి ఓ ఇంటి నల్లాకు మోటారు అమర్చి మంటలార్పారు. 
 
అయితే అక్కడ ఎవరూ లేరు.. ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని ఉండొచ్చని అందరూ భావించారు. అయితే గంటన్నర తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక  ఓ యువకుడు బస్సెక్కగా.. అక్కడ మహదేవ్‌ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
సీఐ శంకర్‌ ఆధ్వర్యంలో పోలీసులు డెడ్‌బాడీని బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. మహదేవ్‌ తమ్ముడి కంప్లైంట్‌తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా మహదేవ్ మరణంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ భవన్‌లో తుపాకీతో తెరాస నేత హల్చల్...