Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తీన్మార్ మల్లన్న ఓడిపోవడంతో యువకుడి ఆత్మహత్య

Advertiesment
Teenmaar Mallanna
, ఆదివారం, 21 మార్చి 2021 (14:18 IST)
తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నిల్లో తెరాస తరపున పోటీ చేసిన వాణీదేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కూడా పోటీ చేశారు. కానీ ఆయన ఓడిపోయాడు. ఈ ఓటమిని జీర్ణించుకోలేక మర్రిగూడ మండలం, లంకలపల్లిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం పురుగులమందు తాగి శ్రీశైలం అనే యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. తీన్మార్ మల్లకు మద్దతుగా ప్రచారం చేశాడు. అయితే కొన ఊపిరితో ఉన్నట్లు భావించిన కుటుంబ సభ్యులు నల్గొండకు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. 
 
ఈ ఘటనపై స్పందించిన తీర్మాన్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ, చాలా బాధాకరమైన విషయమన్నారు. తమ్ముడు శ్రీశైలం తనతోపాటు పాదయాత్రలో పాల్గొన్నాడని, తన టీమ్‌లో ఒక సభ్యుడుగా పనిచేశాడన్నారు. ఎట్టి పరిస్థితిలో రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని తిరిగిన సోదరుడు దూరం కావడం చాలా బాధగా ఉందన్నారు. గెలుపోటములు సహజమని, ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని మల్లన్న విజ్ఞప్తి చేశారు. 
 
'సోదరులారా రాబోయేది మన రాజ్యమే.. ఎవరూ ఆధైర్యపడకండి.. సూసైడ్ చేసుకోవాల్సింది మనంకాదు.. ప్రజలకు దూరంగా ఉన్న రాజకీయ పార్టీలు సూసైడ్ చేసుకోవాలి.. నా మీద అభిమానం ఉన్న సోదరులు ఎవరూ ఇలాంటి పనులు చేయవద్దని' కోరారు. శ్రీశైలం కుటుంబానికి అండగా ఉంటామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నమ్మకాన్ని వమ్ము చేయను.. నా బాధ్యతను విస్మరించను : ఎమ్మెల్సీ వాణీదేవి