Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నీ బిడ్డ కాదు, నా ప్రియుడి సొంతం

Advertiesment
నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నీ బిడ్డ కాదు, నా ప్రియుడి సొంతం
, శనివారం, 20 మార్చి 2021 (14:51 IST)
ఇష్టపడే పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరూ అన్యోన్యంగా కలిసి ఉన్నారు. కానీ ఆమెకు మాత్రం కొన్నిరోజులకు ప్రియుడు గుర్తుకు వచ్చాడు. భర్తను దూరంగా ఉంచింది. భార్యను మందలించి మళ్ళీ ఆమెకు దగ్గరవ్వాలని చూశాడు భర్త. ఆమెలో మార్పు రాకపోగా భర్తనే సూటిపోటి మాటలతో చిత్ర హింసలు పెట్టింది. చివరకు కుటుంబం మొత్తం సర్వనాశనమైంది.
 
తెలంగాణా రాష్ట్రం జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన అట్టపెల్లిరాజు అనే యువకుడు గొల్లపల్లి మండలం బొంకూరుకు చెందిన ఒక యువతితో రెండునెలల క్రితం వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఇది. ఇద్దరూ మొదట్లో బాగానే ఉన్నారు. అయితే భర్తను మాత్రం శారీరకంగా కలవనివ్వలేదు భార్య.
 
దూరంగా ఉంచేది. ఆమె బెడ్రూంలో ఒకే గదిలో వేరుగా పడుకునేది. ఆరోగ్యం బాగా లేదని భర్తకు చెబుతూ వచ్చింది. సున్నిత మనస్కుడైన రాజు భార్య చెప్పేది నిజమని నమ్మాడు. కానీ ఆమె పెళ్లయిన తరువాత కూడా ప్రియుడు రాజేందర్‌ను మర్చిపోలేకపోయింది. 
 
అతనితో గడిపిన క్షణాలను గుర్తు పెట్టుకుంటూనే ఉండేది. దీంతో భర్తను దగ్గరకు రానివ్వలేదు. రెండునెలల పాటు సైలెంట్‌గా ఉన్న రాజు భార్యను దగ్గరకు తీసుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. అయితే భర్త అలా చేయడంతో భార్య ఆగ్రహంతో ఊగిపోయింది.
 
ఇంతలో ఆమె వాంతులు చేసుకుంది. భర్త షాకయ్యాడు. ఏం జరిగిందని ప్రశ్నించాడు. అసలు విషయం చెప్పింది. నేను గర్భవతిని, కానీ నా కడుపులో ఉన్న బిడ్డకు కారణం నువ్వు కాదు నా ప్రియుడు రాజేందర్. అతనే నా ప్రాణం.. నా సర్వస్వం. ఇక నువ్వు బతికి ఉన్నా వేస్ట్.. చచ్చిపో అంటూ భర్తను రెచ్చగొట్టింది.
 
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాజు ఊరి చివరలోని కల్వర్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సుసైడ్ లేఖ రాసి చనిపోయాడు. పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకుని అతని చావుకు కారణమైన భార్యను అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియా స్నేహం.. పదివేల అప్పు ఇచ్చింది.. పెళ్లి పేరుతో లైంగికంగా..?