Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా ఆత్మహత్య ముహూర్తం సాయంత్రం 5.49 గంటలకు, ఉక్కు కార్మికుడి లేఖ కలకలం

నా ఆత్మహత్య ముహూర్తం సాయంత్రం 5.49 గంటలకు, ఉక్కు కార్మికుడి లేఖ కలకలం
, శనివారం, 20 మార్చి 2021 (15:59 IST)
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కర్మాగార కార్మికులు గత కొన్ని రోజులుగా నిరసనలు, దీక్షలు చేస్తున్నారు. ఐనాసరే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసేస్తోంది. వద్దని మొత్తుకుంటున్నా ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతోంది. ఈ నేపధ్యంలో ఉక్కు కార్మికులందరూ ఆందోళన చేస్తున్నారు.
 
ఇదిలావుంటే ఈ రోజు ఉక్కు కార్మికుడు శ్రీనివాసరావు రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. ఆయన లేఖలో ఏం రాశారంటే.. " ప్రియమైన సోదరులారా... మనందరం కలసికట్టుగా వుంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈరోజు జరగబోయే ఉక్కు కార్మిక మహాగర్జన ఒక మైలురాయిగా నిలిచిపోవాలి. 32 మంది ప్రాణత్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం.
 
ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఉక్కు ఉద్యమం కోసం త్యాగం చేస్తున్నాను. ఈ రోజు ఫర్నేసులో అగ్నికి ఆహుతి కావడానికి సాయంత్రం 5.49 గంటలకు ముహూర్తం. ఈ పోరాటంలో ప్రాణత్యాగం నా నుంచి మొదలుకావాలి. జై హింద్" అంటూ లేఖ రాసి ఇంట్లో పెళ్లి వెళ్లాడు. అతడి కోసం గాలింపు చర్య చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ దెబ్బకు ఇండియాలో 3.2 కోట్ల మంది మధ్య తరగతి నుంచి పేదరికంలోకి వెళ్లిపోయారు