Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను తిట్టరు.. ధోనీపై నిందలా?: విరాట్ కోహ్లీ ఫైర్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ట్వంటీ-20 నుంచి విరమించి.. మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించిన నేపథ్యంలో.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (10:10 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ట్వంటీ-20 నుంచి విరమించి.. మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించిన నేపథ్యంలో.. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ధోనీని వెనకేసుకొచ్చాడు. ధోనీపై విమర్శలు గుప్పించేవారిపై మండిపడ్డాడు. తాను విఫలమైనప్పుడు నోరెత్తని వాళ్ళు.. ధోనీని మాత్రం విమర్శిస్తారెందుకని ప్రశ్నించాడు. ధోనీ ఫిట్‌గా వున్నాడని... ఫిట్‌నెస్ పరీక్షల్లో పాసవుతున్నాడని కోహ్లీ ఈ సందర్భంగా తెలిపాడు. మైదానంలో ప్రతి వ్యూహం వెనుకా ధోనీ పాత్ర ఉంటుందని చెప్పాడు
 
న్యూజిలాండ్ సిరీస్‌లో భాగంగా మూడు వన్డేలలో 25, 18, 25, టీ-20ల్లో 7, 49 పరుగులు మాత్రమే ధోనీ చేశాడు. మూడో టీ-20లో ధోనీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో ధోనీ ఆటతీరుపై సీనియర్ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌లో తను విఫలమైన వేళ, పల్లెత్తు మాటని వారు.. ధోనీని విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యాడు. 
 
ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు విమర్శలు చేస్తున్నారని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ధోనీ బరిలోకి దిగుతున్న స్థానం, అప్పుడు ఉండే పరిస్థితిని గురించి ఆలోచించకుండా, అతని శక్తి, నైపుణ్యాలపై నిందలు వేయడం సరికాదని హితవు పలికాడు. ధోనీ  బ్యాటింగ్ దిగే సమయానికి ఒత్తిడి వుంటుందని.. తాను మూడుసార్లు బ్యాట్స్‌మెన్‌గా విఫలమైతే ఏమీ అనని వారంతా.. ధోనీని వేలెత్తి చూపుతున్నారని ఆరోపించాడు. ధోనీ చేసిన తక్కువ స్కోర్లపై తనకు ఎటువంటి ఆందోళనా లేదన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments