Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్ ఫాస్ట్‌లో ఆమ్లెట్, లంచ్‌లో గ్రిల్డ్ చికెన్.. డిన్నర్లో సీఫుడ్స్ వుండాల్సిందే: కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకునే ఆహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ అసలు డైట్‌లో ఏం తీసుకుంటున్నాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (17:50 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకునే ఆహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ అసలు డైట్‌లో ఏం తీసుకుంటున్నాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను రోజువారీగా తీసుకునే మెనూపై కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
 
ఉదయం పూట ఆమ్లెట్, ఆకుకూరలు, చేపలు తీసుకుంటానని.. మధ్యాహ్న భోజనంలో కాల్చిన కోడి మాంసం, వేయించిన బంగాళదుంపలు తప్పకుండా వుండాల్సిందేనని వెల్లడించాడు. రాత్రిపూట మాత్రం చేపలతో వండిన ఆహారం తీసుకుంటానని కోహ్లీ వెల్లడించాడు. 
 
బ్రేక్ ఫాస్ట్‌లో ఆమ్లెట్, చేపలు, ఆకుకూరలు, బొప్పాయి, పుచ్చకాయ, గ్రీన్ టీ విత్ లెమన్ వుంటుందని కోహ్లీ వెల్లడించాడు. అలాగే మూడు కోడిగుడ్ల తెల్లసొన, ఒక కోడిగుడ్డుతో పోసిన ఆమ్లెట్ తీసుకుంటానని తెలిపాడు. రాత్రిపూట డిన్నర్లో తప్పకుండా సీఫుడ్ వుండేలా చూసుకుంటానని చెప్పాడు. పోషకాహారాన్ని మితంగా తీసుకుంటే ఫిట్‌గా వుండొచ్చునని కోహ్లీ సలహా ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

తర్వాతి కథనం
Show comments