Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీకి రెస్ట్ : టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న క్రికెట్ సిరీస్ తర్వాత అత్యంత కీలకమైన సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు వెళ్లనుంది. దీంతో బీసీసీఐ జాతీయ సెలెక

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (18:36 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న క్రికెట్ సిరీస్ తర్వాత అత్యంత కీలకమైన సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు వెళ్లనుంది. దీంతో బీసీసీఐ జాతీయ సెలెక్టర్లు కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. అదేసమయంలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేశారు. మిగతా టీమ్‌లో మార్పులు చేయలేదు. 
 
త‌మ‌కు అస‌లు విరామం ఇవ్వ‌డం లేద‌ని, వ‌రుస‌గా ఒక సిరీస్ త‌ర్వాత‌ మ‌రోటి ఆడుతూనే ఉన్నామ‌ని విరాట్ కోహ్లీ ఇటీవ‌లే మండిప‌డిన విష‌యం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చినట్టు తెలుస్తోంది. కాగా, కొత్త జట్టులో సిద్ధార్థ్ కౌల్‌కు జట్టులో చోటుదక్కింది. మూడో టెస్టు కోసం ఎంపిక చేసిన టీమ్‌లోకి శిఖర్ ధావన్ తిరిగొచ్చాడు. విజయ్ శంకర్‌ను కూడా టీమ్‌లో కొనసాగించారు.
 
ఇదిలావుండగా, ప్రస్తుతం స్వదేశంలో పర్యాటక శ్రీలంకతో భారత క్రికెట్ జట్టు క్రికెట్ సిరీస్ ఆడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే రెండు టెస్ట్‌లు పూర్తిగా, మూడో టెస్ట్ ఢిల్లీలో ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ సిరీస్ తర్వాత వన్డే సిరీస్‌ ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments