Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోహ్లీ అదుర్స్- క్యాలెండర్ ఇయర్‌లో పాంటింగ్ రికార్డ్ బ్రేక్

నాగ్‌పూర్‌లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్

కోహ్లీ అదుర్స్- క్యాలెండర్ ఇయర్‌లో పాంటింగ్ రికార్డ్ బ్రేక్
, ఆదివారం, 26 నవంబరు 2017 (16:22 IST)
నాగ్‌పూర్‌లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం ద్వారా క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా కోహ్లీ.. పాంటింగ్ రికార్డును బ్రేక్ చేశాడు. 
 
ఆస్ట్రేలియా లెజెండరీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో తొమ్మిది సెంచరీలు చేయగా.. కోహ్లీ పది సెంచరీలతో ఆ రికార్డును అధిగమించాడు. అయితే పాంటింగ్ రెండు క్యాలెండర్ ఇయర్లలో తొమ్మిదేసి సెంచరీలు చేశాడు. కోహ్లీ ఇప్పటికే వన్డేల్లో అత్యధిక సెంచరీల జాబితాలో పాంటింగ్ (30) రికార్డును బ్రేక్ చేసి, ప్రస్తుతం 32 శతకాలతో రెండో స్థానంలో నిలిచాడు. మొత్తంగా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 51 సెంచరీలు సాధించగా, వంద సెంచరీలతో సచిన్ అగ్రస్థానంలో వున్నాడు. కోహ్లీ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. 
 
ఇక శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్స్ అదుర్స్ అనిపించారు. రాహుల్ ఏడు పరుగులకే అవుటైనా, విజయ్ (128), పుజారా (143), విరాట్ కోహ్లీ 213 (267 బంతుల్లో 14 ఫోర్లు) సాధించారు. రహానే 2 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. ఇక రోహిత్ శర్మ (160 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్) 102 పరుగులతో, అశ్విన్ (1)లు నాటౌట్‌గా నిలిచారు. తద్వారా తొలి ఇన్నింగ్స్‌కు భారత్ 600 పరుగుల వద్ద తెరదించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ- లారా రికార్డ్ సమం (వీడియో)