Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చాక్లెట్లు, డబ్బు ఆశ చూపి బాలికలపై రేప్... వృద్ధుడి నిర్వాకం

అభంశుభం తెలియని చిన్నారులకు చాక్లెట్లు, డబ్బు, ఇతర వస్తువులు ఆశచూపి ఓ 85 యేళ్ళ వృద్ధుడు అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆ కామాంధుడిని హైదరాబాద్ షీ టీమ్స్ గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. తాజాగా వ

చాక్లెట్లు, డబ్బు ఆశ చూపి బాలికలపై రేప్... వృద్ధుడి నిర్వాకం
, గురువారం, 23 నవంబరు 2017 (10:27 IST)
అభంశుభం తెలియని చిన్నారులకు చాక్లెట్లు, డబ్బు, ఇతర వస్తువులు ఆశచూపి ఓ 85 యేళ్ళ వృద్ధుడు అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆ కామాంధుడిని హైదరాబాద్ షీ టీమ్స్ గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూసి వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్న 85 ఏళ్ల వృద్ధుడి ఆట కట్టించింది హైదరాబాద్ షీ టీమ్స్ బృందం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ అదనపు డీసీపీ షేక్ సలీమా (షీ టీమ్స్) కథనం ప్రకారం...
 
హైదరాబాద్, కాప్రా ప్రథమపురి కాలనీకి చెందిన ఎన్.సత్యనారాయణరావు (85) మాజీ రైల్వే ఉద్యోగి. గతేడాది భార్య చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఇంటికి సమీపంలో ఉండే ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలికలపై కన్ను వేసిన సత్యనారాయణ వారికి చాక్లెట్లు, డబ్బులు ఆశ చూపించి ఇంటికి తీసుకెళ్లి గత ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
 
గత కొన్ని రోజులుగా విద్యార్థినులు ముభావంగా కనిపించడం, హోం వర్క్ చేయకపోవడంతో ఉపాధ్యాయులు వారి నోటు పుస్తకాలను తనిఖీ చేయడంతో విషయం బయటపడింది. వారి పుస్తకాల్లోంచి వంద రూపాయల నోట్లు కనిపించడంతో వారి తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి ఆరా తీశారు.
 
సత్యనారాయణ తాత తమకు ఆ డబ్బులు ఇచ్చినట్టు చెప్పి, చేయకూడని పనులు చేసినట్టు చెప్పారు. దీంతో ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంగట్లో 'లోకల్ ఫిలిం' పేరుతో అత్యాచారాల వీడియోల విక్రయం