31న భారత్ వర్సెస్ కివీస్ : ఆ ఇద్దరిని పక్కనబెట్టాలన్న సునీల్ గవాస్కర్

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (11:55 IST)
దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇందులో పాకిస్థాన్ జట్టు 10 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. అయితే, తన తదుపరి మ్యాచ్‌ను బలమైన న్యూజిలాండ్ జట్టుతో ఈ నెల 31వ తేదీ ఆదివారం తలపడనుంది. 
 
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశారు. భారత తుది జట్టులో రెండు మార్పులు చేయాలని సూచించారు. ఆల్ రౌండర్‌గా జట్టులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయలేని పక్షంలో అతన్ని పక్కన పెట్టాలని... అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించారు. 
 
అలాగే, బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌‌ని తీసుకోవాలని చెప్పారు. భుజం గాయంతో బాధపడుతున్న హార్ధిక్ పాండ్యా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేదు. అయితే నెట్స్‌లో మాత్రం బౌలింగ్ చేస్తూ కనిపించాడు. 
 
ఈ నేపథ్యంలోనే హార్ధిక్‌ను పక్కన పెట్టాలని గవాస్కర్ సూచించారు. జట్టులో ఈ రెండు మార్పులు చేస్తే సరిపోతుందని... అంతకు మించి మార్పులు చేస్తే టీమిండియా భయపడుతోందని ప్రత్యర్థి జట్టు భావించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

గాల్లో ఉండగా ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య - ప్రయాణికులు సురక్షితం

Nobel Peace Prize ట్రంప్‌కి కాదు, మరియా కొరినా మచాడోని వరించిన పురస్కారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohanlal: వృష‌భ‌ తో థియేట‌ర్స్‌లో గ‌ర్జించ‌నున్న‌ మోహ‌న్ లాల్

Ari movie review : అరిషడ్వర్గాల నేపథ్యంగా అరి చిత్రం రివ్యూ

మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు

Priyadarshi: ప్రేమంటే లో దోచావే నన్నే.. అంటూ ప్రియదర్శి, ఆనంది పై సాంగ్

Deepika : కల్కి 2, స్పిరిట్ సినిమాలకు క్రూరమైన వర్కింగ్ అవర్స్ అన్న దీపికా

తర్వాతి కథనం
Show comments