Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోహ్లీ వెంటనే సచిన్‌కు ఫోన్ చేసి మాట్లాడు.. ఆయన సాయం తీసుకో?

Advertiesment
కోహ్లీ వెంటనే సచిన్‌కు ఫోన్ చేసి మాట్లాడు.. ఆయన సాయం తీసుకో?
, గురువారం, 26 ఆగస్టు 2021 (13:22 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ స్ఫూర్తి పొందాలని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. 2004 సిడ్నీ టెస్టులో సచిన్ తన సత్తా చాటి తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టే కోహ్లీ కూడా ఫామ్ ను తిరిగి సంపాదించుకోవాలన్నారు. 
 
''కోహ్లీ వెంటనే సచిన్ టెండూల్కర్ కు ఫోన్ చేయాలి. ఏం చేయాలో అడగాలి. అతడి సలహాలు తీసుకోవాలి'' అని సూచించారు. కవర్ డ్రైవ్ ఆడనని తనకు తాను చెప్పుకోవాలన్నారు.
లీడ్స్‌లో ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఆండర్సన్ బౌలింగ్ లో కోహ్లీ కేవలం 7 పరుగులకే అవుటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సన్నీ ఈ కామెంట్లు చేశారు. 
 
ఆఫ్ స్టంప్ కు ఆవల పడిన బంతులను కోహ్లీ వేటాడడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఐదు, ఆరు, ఏడో స్టంప్ ల దగ్గర పడిన బంతులకు కోహ్లీ ఔట్ కావడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమన్నారు. 2014లో అతడు అలాగే ఆఫ్ సైడ్ స్టంప్‌ల మీద పడిన బంతులకే ఎక్కువ సార్లు అవుటైన విషయాన్ని గుర్తు చేశారు. 
 
కాగా, 2004 సిడ్నీ టెస్టులో సచిన్ టెండూల్కర్ 241 పరుగులతో అజేయంగా నిలిచాడు. 613 నిమిషాల పాటు క్రీజులో నిలిచిన లిటిల్ మాస్టర్.. ఒక్కసారి కూడా కవర్ డ్రైవ్ ఆడలేదు. సచిన్ ఇన్నింగ్స్ తో భారత్ 705/7 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. సొంతగడ్డపై ఆడుతున్న ఆస్ట్రేలియా మ్యాచ్ ను డ్రా చేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఫ్ఘన్ క్రికెట్‌పై తాలిబన్ల ప్రభావం.. వన్డేల సిరీస్ వాయిదా