Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్ చేతిలో భారత్ ఓడిపోవడానికి కారణాలు చెప్పిన సచిన్

Advertiesment
ICC T20 World Cup 2021
, బుధవారం, 27 అక్టోబరు 2021 (08:06 IST)
దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా, గత ఆదివారం భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టు 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ ఓటమికి అనేక రకాలైన కారణాలను క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్, బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ సైతం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేసిన సచిన్‌ ఇలా చెప్పుకొచ్చాడు.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించిందని, పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా భారత్‌ ఇంచుమించు 20-25 పరుగులు తక్కువ స్కోర్‌ సాధించిందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా షహీన్‌ అఫ్రిది విసిరిన అప్‌ఫ్రంట్‌ బంతులను ఎదుర్కొనే సమయంలో భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ సరైన ఫుటవర్క్‌తో కనిపించలేదన్నాడు. 
 
పాక్‌ పేసర్‌ గంటకు 140 కిమీ వేగంతో బంతులు విసురుతుంటే.. మన బ్యాట్స్‌మెన్‌ అందుకు తగ్గట్టు క్రీజులో లేరన్నాడు. మరోవైపు పాక్‌ జట్టు తమ బౌలర్లను ఖచ్చితమైన ప్రణాళికతో సమర్థవంతంగా వినియోగించుకుందని, ఒకరి తర్వాత ఒకరిని అవసరాలకు తగ్గట్టు బౌలింగ్‌ చేయించిందని సచిన్‌ వివరించాడు.
 
అలాగే టీమ్‌ఇండియా చాలా రోజులుగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడలేదని, దీంతో ఆ జట్టును అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుందన్నాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిందని గుర్తుచేశాడు. సూర్యకుమార్‌ రెండు షాట్లు బాగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడన్నాడు. 
 
అనంతరం కోహ్లీ, పంత్‌ భాగస్వామ్యం నిర్మించాలని చూసినా అవసరమైనంత ధాటిగా ఆడలేదని అభిప్రాయపడ్డాడు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం భారత్‌ అవకాశాలను దెబ్బ తీసిందన్నాడు. మరోవైపు పాక్‌ లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా ఆదిలోనే వికెట్లు తీయలేకపోయిందని సచిన్‌ వివరించాడు. అలా చేసిఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని, దాంతో పాక్‌ బ్యాట్స్‌మెన్‌ ఒత్తిడిలోకి వెళ్లేవారని పేర్కొన్నాడు. 
 
భారత బ్యాటింగ్‌ సమయంలో పాకిస్థాన్‌ అదే చేసిందని స్పష్టం చేశాడు. ఇక పాక్‌ ఓపెనర్లు రిజ్వాన్‌, బాబర్‌ మెల్లిగా స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ టీమ్‌ఇండియాపై ఒత్తిడి తెచ్చారన్నాడు. తేలికైన బంతుల్ని బౌండరీలకు తరలిస్తూనే సింగిల్స్‌, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మించారని తెలిపాడు. అయితే, టీమ్‌ఇండియా కీలక సమయాల్లో ఒత్తిడి పెంచి పైచేయి సాధించే అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందని దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ద్రవిడ్ దరఖాస్తు