Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌తో తెగదెంపులు చేసుకుంటానంటున్న వార్నర్??

Advertiesment
David Warner
, శుక్రవారం, 29 అక్టోబరు 2021 (10:53 IST)
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గట్టి సంకేతాలు పంపించారు. ఐపీఎల్ ఫ్రాంజైలలో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్.. ఆ జట్టుతో తెగదెంపులు చేసుకుంటానని ప్రకటించారు. దీంతో ఆయనకు గాలం వేసేందుకు మరో నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. 
 
తన ఫెవరెట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి తీవ్ర పరాభావన్ని, అవమానాలను ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్, అందరూ ఊహించినట్టే ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్త జట్టుకి ఆడబోతున్నట్టు ప్రకటించారు. 
 
కెప్టెన్‌గా ఐపీఎల్ 2016 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి టైటిల్ అందించాడు. ఆ సీజన్‌లో 800+పైగా పరుగులు చేసి, విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
 
అయితే, ‘ఇది జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ ఇద్దరూ నాకంటే బాగా ఆడుతున్నారు. నా కంటే బాగా బ్యాటును బంతి మధ్యలో నుంచి కొట్టగలుగుతున్నారు. వారికి అవకాశం ఇవ్వడమే కరెక్ట్. ఓ ప్రొఫెషనల్ అథ్లెట్‌గా జట్టు ఇచ్చే ప్రతీ దాన్ని చిరున/వ్వుతో స్వీకరించాల్సి ఉంటుంది. జట్టుతో ఉన్నప్పుడు డ్రింక్స్ మోయడానికి కూడా నేనెప్పుడూ సిగ్గు పడలేదు. 
 
అయితే నన్ను ఎందుకు కెప్టెన్సీ నుంచి తొలగించారనే విషయంపై నాకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు. ఐపీఎల్ 2022 వేలంలో నా పేరు పెడతాను. సన్‌రైజర్స్ హైదరాబాద్ తీరు చూస్తుంటే నన్ను రిటైన్ చేసుకోవడం వాళ్లకి ఏ మాత్రం ఇష్టం లేనట్టే ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులు.. నీరజ్ చోప్రా, మిథాలి రాజ్‌ల పేర్లు