Publish Date: Tue, 10 Aug 2021 (20:36 IST)
Updated Date: Tue, 10 Aug 2021 (20:38 IST)
సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 19 నుంచి మొదలు కానున్న ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె మ్యాచ్‌లకు తాను అందుబాటులోకి వస్తున్నట్టు డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. మంగళవారం ఆయన 'ఐ విల్ బి బ్యాక్.. అంటూ పోస్ట్ చేశాడు.
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడడానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం వార్నర్‌ను కెప్టెన్సీ, అలాగే జట్టు నుంచి తప్పించి కేన్ విలియమ్స్‌న్‌కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. దాంతో అప్పుడు వార్నర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. జట్టుకు కప్ అందించిన అతన్ని ఎలా తొలగిస్తారు అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శించారు.
అనంతరం ఐపీఎల్ వాయిదా పడింది. తర్వాత మళ్లీ రెండో అంచెలో మ్యాచ్ లో జరుగుతాయని తెలిసిన వార్నర్ ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడడంపై అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ వార్నర్ క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో అభిమానులు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు.
సెల్వి
Publish Date: Tue, 10 Aug 2021 (20:36 IST)
Updated Date: Tue, 10 Aug 2021 (20:38 IST)