'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న' అవార్డుల కోసం జాతీయ క్రీడా పురస్కారాల కమిటీ నీరజ్ చోప్రా, మిథాలి రాజ్ సహా 11 మంది పేర్లను సిఫారసు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన నీరజ్ చోప్రా సహా 11 మంది పేర్లను కమిటీ ఈ అవార్డుల కోసం సిఫారసు చేసినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది.
రెజ్లర్ రవి దహియా, బాక్సర్ లవ్లీనా, ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి, మహిళా క్రికెటర్ మిథాలి రాజ్, హాకీ ఆటగాడు పి.శ్రీజేశ్ ఈ జాబితాలో ఉన్నారు.
షూటర్ అవని లక్రా సహా అయిదుగురు పారా అథ్లెట్ల పేర్లనూ ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ చేశారు. క్రికెటర్ శిఖర్ ధావన్ సహా 35 మందిని అర్జున అవార్డుకు కమిటీ నామినేట్ చేసింది. కాగా టోక్యో ఒలింపిక్స్ అనంతరం భారత అత్యున్నత క్రీడాపురస్కారమైన 'రాజీవ్ ఖేల్ రత్న' పేరును 'మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న'గా మార్చారు.