Webdunia - Bharat's app for daily news and videos

Install App

చండీమల్‌పై ఐసీసీ వేటు.. బాల్ ట్యాంపరింగ్ నిజమే..

వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీలంక కెప్టెన్ చండీమల్ ఆ ఆరోపణలను ఖండించాడు. బోర్డు కూడా అతడికి అండగా నిలిచింది. తాను ట్యాంపరింగ్‌కు పాల్ప

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (09:32 IST)
వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీలంక కెప్టెన్ చండీమల్ ఆ ఆరోపణలను ఖండించాడు. బోర్డు కూడా అతడికి అండగా నిలిచింది. తాను ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని చెప్పాడు. అయితే, అదంతా అబద్ధమేనంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఆధారంగా చండీమల్‌పై ఐసీసీ వేటేసింది.
 
విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు తేలడంతో మూడో టెస్టులో ఆడకుండా నిషేధం విధించింది. దీంతోపాటు మ్యాచ్‌ ఫీజులో వందశాతం జరిమానా విధించింది. తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని తొలుత బుకాయించిన చండీమల్ తర్వాత నిజాన్ని అంగీకరించాడు. బాల్‌ను షైన్ చేసేందుకు కృత్రిమ పదార్థాన్ని ఉపయోగించినట్టు ఐసీసీ విచారణలో తేలింది.  
 
వీడియో ఫుటేజీ పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నాడు. బంతిపై కృత్రిమ పదార్థాన్ని రాసినట్టు రివ్యూలో స్పష్టంగా కనిపించిందన్నాడు. దానికి లాలాజలం రాసి బంతిని మెరిపించే ప్రయత్నం చేసినట్టు గుర్తించామన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments