ఆదమరిస్తే అంతేసంగతులు : నేడు బంగ్లాదేశ్‌తో భారత్ కీలక పోరు
						
		
						
				
శ్రీలంక వేదికగా జరుగుతున్న నిదహస్ టీ20 టోర్నీలో భాగంగా భారత క్రికెట్ జట్టు బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటికే రెండు విజయాలతో, నెట్‌రన్ రేట్‌లో ఫైనల్‌కు ప్రవేశించిన కోహ్లీ సేన... బుధవారం నాటి మ
			
		          
	  
	
		
										
								
																	శ్రీలంక వేదికగా జరుగుతున్న నిదహస్ టీ20 టోర్నీలో భాగంగా భారత క్రికెట్ జట్టు బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇప్పటికే రెండు విజయాలతో, నెట్‌రన్ రేట్‌లో ఫైనల్‌కు ప్రవేశించిన కోహ్లీ సేన... బుధవారం నాటి మ్యాచ్‌లో కూడా బంగ్లాదేశ్‌పై విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. తద్వారా సమీకరణాలతో సంబంధం లేకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో టోర్నీ ఫైనల్‌కు చేరాలన్న పట్టుదలతో ఉంది. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	ఇకపోతే, బంగ్లాదేశ్ ఆడిన రెండు లీగ్‌లలో ఒక దానిలో విజయం సాధించగా, మరొకదానిలో ఓటమిపాలైంది. దీంతో నేటి మ్యాచ్‌లో ఓటమిపాలైనప్పటికీ శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆ జట్టు ఫైనల్ చేరుతుంది. లేని పక్షంలో నేటి మ్యాచ్‌లో బంగ్లా జట్టు విజయం సాధించి, శ్రీలంక చేతిలో ఓడితే జట్లన్నీ నాలుగేసి పాయింట్లతో రన్‌రేట్ ఆధారంగా ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో విజయం సాధించడం రెండు జట్లకు అతిముఖ్యంగా మారింది.