Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బెంగాల్ టైగర్' ముఖ్యమంత్రి అవుతాడు : సెహ్వాగ్ జోస్యం

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పారు. బెంగాల్ టైగర్‌, దాదాగా నిక్‌నేమ్స్ కలిగిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏదో ఒకరోజున బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడంటూ విశ్వాసం వ్

Webdunia
బుధవారం, 2 మే 2018 (11:14 IST)
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పారు. బెంగాల్ టైగర్‌, దాదాగా నిక్‌నేమ్స్ కలిగిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏదో ఒకరోజున బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడంటూ విశ్వాసం వ్యక్తంచేశాడు. సీఎం కంటే ముందుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు స్వీకరిస్తాడని తెలిపారు.
 
సౌరవ్ గంగూలీ రచించిన 'ఏ సెంచరీ నాట్‌ ఇనఫ్' పుస్తకావిష్కరణ కార్యక్రమం తాజాగా జరిగింది. ఇందులో సెహ్వాగ్ పాల్గొని మాట్లాడాడు. ఈ సందర్భంగా నాటి ఓ ఘటనను వీరు గుర్తుచేశాడు. 'ఓసారి మ్యాచ్‌ అయిపోయాక సౌరవ్‌ విలేకరుల సమావేశానికి వెళ్లాల్సి ఉంది. దాంతో తన బ్యాగును సర్దాల్సిందిగా అతడు మమ్మల్ని ఆదేశించాడు. మేమేమో జట్టులో జూనియర్లం. దాంతో కెప్టెన్‌ ఆదేశాన్ని శిరసావహించక తప్పలేదు' అని సభికుల నవ్వుల మధ్య వెల్లడించాడు. 
 
ఇందుకు గంగూలీ ముసిముసి నవ్వులు చిందిస్తూ 'అబ్బే.. వారేమీ నాపై ప్రేమతో అలా చేయలేదు. మ్యాచ్‌ కాగానే వెళ్లిపోవాల్సి ఉండటంవల్లే నా బ్యాగు సర్దారు' అని అన్నాడు. యువరాజ్‌ మాట్లాడుతూ, యువ క్రికెటర్లకు సౌరవ్‌ ఎంతో అండగా నిలిచేవాడని గుర్తు చేశాడు. అలాగే, దాదా స్పందిస్తూ, 'నేను కెప్టెన్‌గా ఉన్న సమయంలో అద్భుత జట్టు లభించింది. యువ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఆడేలా ప్రోత్సహించాను' అని చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

పట్టపగలే నడి రోడ్డుపై హత్య.. మద్యం తాగి వేధిస్తున్నాడని అన్నయ్యను చంపేశారు..

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

తర్వాతి కథనం
Show comments