Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌరవ్ గంగూలీకి గుండెపోటు.. యాంజియోప్లాస్టీ చేయాలట

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (14:49 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఇంటికి సమీపంలోని వుడ్‌ల్యాండ్‌ దవాఖానకు తరలించారు. యాంజియోప్లాస్టీ చేయాల్సిన అవసరం ఉందని దవాఖాన వర్గాలు చెప్పినట్లు సమాచారం. గంగూలీకి గుండెపోటు వచ్చిందన్న సమాచారం రాగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన క్షేమం కోరుతూ వివిధ ఆలయాల్లో ప్రార్థనలు చేశారు.
 
శనివారం ఉదయం వేళ ఎప్పటిమాదిరిగానే తేన ఇంట్లోని జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా అసౌకర్యంగా ఫీలయ్యాడు. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపాడు. గుండెలో నొప్పిగా ఉన్నదంటూ గంగూలీ ఫిర్యాదు చేశాడు. దాంతో ఆయనను ఇంటికి సమీపంలోని వుడ్‌ల్యాండ్‌ దవాఖానకు తరలించారు. అక్కడ పరీక్షించిన డార్టర్‌ సరోజ్‌ మొండల్‌తో కూడిన ముగ్గురు సభ్యుల బృందం.. గుండెకు యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. 
 
యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత భారత మాజీ కెప్టెన్‌ను శనివారం డిశ్చార్జ్ చేస్తారని బోరియా మజుందార్ ధ్రువీకరించారు. అహ్మదాబాద్‌లో డిసెంబర్‌ 24 న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరైన గంగూలీ.. అనంతరం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల స్టేడియంలో నెలకొల్పిన అరుణ్‌ జైట్లీ విగ్రహం ప్రారంభోత్సవం కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్‌షాతో కలిసి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Driver: మైనర్ బాలికపై అత్యాచారం- డ్రైవర్‌కు పదేళ్ల జైలు శిక్ష

స్నేహితుడి సలహా మేరకు మర్మాంగాన్ని కోసుకున్నాడు.. ఎక్కడ?

Woman: చికెన్ వండలేదని భార్యను హత్య చేశాడు.. దుప్పటిలో చుట్టి గంగానదిలో పారేశాడు

Telangana: సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

3K Namo Run: ప్రధాని 75వ జన్మదినోత్సవం- హైదరాబాద్‌లో 3కె నమో రన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్షవర్ధన్ షాహాజీ షిండే- కొత్తదారులు చూపుతున్న యువ పారిశ్రామికవేత్త

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

తర్వాతి కథనం
Show comments