తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ నిలిపివేసింది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రం రిజిస్ట్రేషన్ల సర్వీసులు కొనసాగనున్నాయి.
స్లాట్ బుకింగ్ అయిన వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్ సర్వీసులు అందనున్నాయి. ఇక రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ సమయంలో ఆధార్ ఆప్షన్ తొలగించడమా, కొనసాగించాలా అనే విషయంపై ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం పాత స్లాట్స్‌కు రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తామని కొత్త స్లాట్స్ బుకింగ్ కావు. తాత్కాలికంగా కార్డ్ వెబ్సైట్‌లో స్లాట్స్ నిలిపివేశామని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు తెలిపాయి. ఈరోజు రేపటిలో దీనికి సంబందించిన క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.