Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతన్నలకు గుడ్ న్యూస్... ఏంటదో తెలుసా?

రైతన్నలకు గుడ్ న్యూస్... ఏంటదో తెలుసా?
, మంగళవారం, 13 అక్టోబరు 2020 (13:39 IST)
రైతన్నలకు గుడ్ న్యూస్. కేంద్ర సర్కారు పీఎం కిసాన్ స్కీమ్ నుంచి కొత్త స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. అదే ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన. ఈ స్కీమ్‌లో రైతులు చేరొచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన రైతులకు ప్రతి నెలా రూ.3,000 లభిస్తాయి. అయితే దీని కోసం రైతులు ముందు నుంచే ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు కడుతూ రావాలి. ఇది పెన్షన్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. 
 
పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన వారు ఆటోమేటిక్‌గానే ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా కిసాన్ మాన్‌ధన్ యోజన స్కీమ్‌లో చేరొచ్చు. డబ్బులు ఆటోమేటిక్‌గానే బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి. 60 ఏళ్లు దాటిన రైతులు ప్రతి నెలా రూ.3,000 పొందొచ్చు. అంటే సంవత్సరానికి రూ.36,000 వస్తాయని చెప్పుకోవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న రైతులు ఎవరైనా సరే కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో చేరొచ్చు. 
 
నెలకు రూ.55 నుంచి రూ.200 మధ్యలో చెల్లిస్తూ రావొచ్చు. మీ వయసు ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన డబ్బులు మారతాయి. 18 ఏళ్లకే స్కీమ్‌లో చేరితే నెలకు రూ.55 కట్టాలి. 5 ఏకరాలకు లోపు పొలం ఉండాలి. అంతేకాకుండా ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌వో స్కీమ్స్‌లో చేరిన వారు ఈ స్కీమ్‌లో చేరేందుకు అనర్హులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానానికి మాస్కులా? ఇదెలా సాధ్యం..? (video)