Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ రేట్లు మాత్రం యధాతథం... కానీ, వడ్డీ రేట్లను మార్చిన ఆర్బీఐ

ఆ రేట్లు మాత్రం యధాతథం... కానీ, వడ్డీ రేట్లను మార్చిన ఆర్బీఐ
, శుక్రవారం, 9 అక్టోబరు 2020 (10:50 IST)
భారత రిజర్వు బ్యాంకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెపో, రివర్స్ రెపో రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ, వడ్డీ రేట్లలో మాత్రం స్వల్ప మార్పులు చేసింది. అలాగే ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. అంతేకాకుండా కరోనా లాక్డౌన్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఆరుగురు సభ్యుల బృందం అక్టోబరు 7 నుంచి మూడు రోజుల పాటు పరపతి సమీక్షింది. ఇందులో బోర్డు తీసుకున్న నిర్ణయాలను ఆయన శుక్రవారం మీడియాకు వెల్లడించారు. రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగుతాయన్నారు. ఆర్థిక వృద్ధి నిదానంగా సాగుతున్న వేళ, వడ్డీ రేట్లను మరింతగా తగ్గించాల్సిన అవసరం లేదని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. 
 
అదేసమయంలో దేశంలో ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే ఉందన్నారు. ద్రవ్యోల్బణం రానున్న మూడు నెలల వ్యవధిలో మరింతగా తగ్గుతుందని అంచనా వేస్తున్నామని, 2021 నాలుగో త్రైమాసికం నాటికి ఆర్బీఐ టార్గెట్‌కు దగ్గరకు వస్తుందని భావిస్తున్నామని అన్నారు.
 
గత పరపతి సమీక్షల తర్వాత కీలక రేట్లను తగ్గించామని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో స్వల్ప రికవరీ నమోదైందని, ఇది రెండో అర్థభాగంలో మరింతగా నమోదవుతుందని, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభంకావడం శుభసూచకమని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మరో 70 వేలు.. తెలంగాణాలో 1800 కరోనా పాజిటివ్ కేసులు