Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ టెండూల్కర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు..

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (11:55 IST)
క్రికెట్ దేవుడు, సచిన్ టెండూల్కర్‌ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. సచిన్ టెండూల్కర్‌కు 'లారస్ స్పోర్టింగ్ అవార్డు-2020' లభించింది. ఈ నేపథ్యంలో లారస్ స్పోర్టింగ్ అవార్డుల ప్రదానోత్సవంలో సచిన్‌కు అత్యధిక ఓట్లు రావడంతో ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 
 
బెర్లిన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా చేతులు మీదుగా మాస్టర్ ఈ అవార్డు అందుకున్నాడు. 2011 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో అద్భుత ఫీట్ సాధించిన సచిన్‌కు ఈ అవార్డు రావడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  
 
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. తన జీవితంలో ఇదో మధురక్షణమని వ్యాఖ్యానించాడు. క్రికెట్‌లో ప్రపంచకప్ గెలవడం ఓ అద్భుతం. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమన్నాడు. తనకు పదేళ్ల వయసులో ఉండగా 1983లో కపిల్ నేతృత్వంలోని భారత జట్టు ప్రపంచకప్ గెల్చుకుంది. 
 
అప్పుడు దాని ప్రాముఖ్యత తనకు తెలియదని.. అందరిలా తాను కూడా సంబరాలు చేసుకున్నానని చెప్పాడు. కానీ 2011లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నప్పుడే ఆ గొప్పతనం ఏంటో తనకు తెలిసిందని వ్యాఖ్యానించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

తర్వాతి కథనం
Show comments