Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాహుల్ ద్రవిడ్ పుట్టిన రోజు.. సచిన్ శుభాకాంక్షలు.. ఫోటో వైరల్

Advertiesment
రాహుల్ ద్రవిడ్ పుట్టిన రోజు.. సచిన్ శుభాకాంక్షలు.. ఫోటో వైరల్
, శనివారం, 11 జనవరి 2020 (13:09 IST)
టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌కు పుట్టిన రోజు నేడు. ది వాల్, మిస్టర్ డిఫెండబుల్‌గా పేరుగాంచిన ద్రావిడ్.. తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. క్రికెట్ నుంచి రిటైరైనా.. అండర్-19, ఇండియా-ఏ జట్లకు కోచ్ గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలో యువ క్రికెటర్ లు వెలుగులోకి వచ్చారు. 
 
టీమిండియా బ్యాక్ బెంచ్ పటిష్టంగా ఉండడంలో రాహుల్ పాత్ర ఎనలేనిది. ఈ విషయం జట్టు యాజమాన్యమే చాలాసార్లు తెలిపింది. కాగా, నేటితో ద్రావిడ్‌.. 47వ పడిలోకి ప్రవేశించాడు. అతడికి ఐసీసీ, బీసీసీఐ సహా పలువురు క్రీడా ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  
 
కాగా ఇండియన్‌ క్రికెట్‌ జట్టుకు ద్రవిడ్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ప్రస్తుతం, నేషనల్‌ క్రికెట్‌ అకాడెమీకి డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జనవరి 11, 1973 ఇండోర్‌లో జన్మించిన ద్రావిడ్‌.. టెస్టు మ్యాచ్ తో క్రికెట్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు.
 
ఇంగ్లాండ్‌తో తన తొలి టెస్టు మ్యాచ్‌ ఆడిన ద్రావిడ్‌, శ్రీలంకతో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో మొత్తం 164 టెస్టులకు ప్రాతినిథ్యం వహించిన ద్రావిడ్‌ 52.3 సగటుతో 13,288 పరుగులు సాధించాడు. అందులో 36 సెంచరీలు, 63 అర్ధసెంచరీలున్నాయి. 344 వన్డేలకు ప్రాతినిథ్యం వహించిన ద్రావిడ్‌.. 10,889 పరుగులు సాధించాడు. అందులో 12 సెంచరీలు సహా 83 అర్ధసెంచరీలున్నాయి. ఒకే ఒక టీ 20 మ్యాచ్‌ ఆడి 31 పరుగులు సాధించాడు.
 
కాగా ద్రవిడ్ పుట్టిన రోజును పురస్కరించుకుని క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలియజేశాడు. పలు రికార్డులు బద్ధలు కొట్టిన స్నేహితుడు ద్రవిడ్ గ్రేట్ అంటూ కితాబిచ్చాడు. బ్యాటింగ్ చేసిన విధానం ఎల్లప్పుడూ బౌలర్లకు పెద్ద తలనొప్పి అన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంకను చితక్కొట్టేశారు : ట్వంటీ20 సిరీస్ భారత్ వశం