ప్రేమమ్ అనుపమతో బుమ్రా డేటింగ్.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్

బుధవారం, 12 జూన్ 2019 (16:50 IST)
హీరోయిన్లు, క్రికెట‌ర్ల మ‌ధ్య ప్రేమాయ‌ణం ఈనాటిది కాదు… నాటి ప‌టౌడీ, ష‌ర్మిలా ఠాగూర్ నుంచి నేటి విరాట్ కోహ్లీ, అనుష్క‌శ‌ర్మ దాకా ఎంద‌రో క్రికెట‌ర్లు హీరోయిన్ల‌తో ప్రేమాయణం సాగించారు. ఈ జాబితాలో సౌరభ్ గంగూలీ, జడేజా, ధోనీ, రైనా, కేఎల్ రాహుల్, పాండ్యా ఇలా చాలా మంది క్రికెటర్లు హీరోయిన్స్‌తో ప్రేమాయణం సాగించినట్టు వార్తలొచ్చాయి. తాజాగా ఈ జాబితాలో భారత యువ ఫాస్ట్ బౌలర్ బుమ్రా చేరారు. 
 
బౌలర్ అయిన బుమ్రా దక్షిణాది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా గుప్పుమంటున్నాయి. అందుకు కారణం బుమ్రా తన ట్విట్టర్ ఖాతాలో ఫాలో అవుతున్న సెలబ్రిటీల్లో లేడీ సెలబ్రిటీ అనుపమ ఒక్కటే ఉండటం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌ని బూమ్రా ఫాలో కావడంతో పాటు.. ఒకరి పోస్ట్‌లను ఒకరు షేర్ చేసుకుని లైక్స్ చేస్తుండటంతో ఇద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్ నడుస్తుందంటూ ప్రచారం ఊపందుకుంది. 
 
అయితే ఈ వార్తలపై స్పందించిన అనుపమ.. ప్రేమ లేదు దోమ లేదు అంటోది. ఇలాంటి వదంతులను ఎలా పుట్టిస్తారో అర్థం కాదు. బూమ్రా తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని అనుపమ క్లారిటీ ఇచ్చింది. గతంలో రాశిఖన్నా కూడా బూమ్రా ప్రేమలో ఉందంటూ పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే.
 
ఇకపోతే.. ప్రేమమ్ చిత్రంతో కుర్రహృదయాలను కొల్లగొట్టిన అనుపమ.. అఆ, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం టౌంటన్‌‌లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్.. జంపా స్థానంలో రిచర్డ్ సన్..