Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడిప్పుడే నీవు ఇంటినుంచి వెళ్లినట్టుంది... సచిన్ భావోద్వేగపు ట్వీట్

భారత మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓ భావోద్వేగపు ట్వీట్ చేశారు. అదీ కూడా తన గారాలపట్టి సారా టెండూల్కర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పట్టా పుచ్చుకు

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (09:33 IST)
భారత మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓ భావోద్వేగపు ట్వీట్ చేశారు. అదీ కూడా తన గారాలపట్టి సారా టెండూల్కర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పట్టా పుచ్చుకున్న సందర్భంగా ఈ ట్వీట్ చేశారు.
 
శుక్రవారం లండన్‌లో సారా డిగ్రీ పట్టాను అందుకున్నారు. 'ఇప్పుడిప్పుడే నీవు ఇంటినుంచి వెళ్లినట్టుంది. అప్పుడే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినందుకు మాకు గర్వంగా ఉంది. నీవు ఈ ప్రపంచాన్ని జయించాలని కోరుకుంటున్న' అంటూ లిటిల్ మాస్టర్ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం సచిన్ ట్వీట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
క్రికెట్ తర్వాత కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే సచిన్ సారా స్నాతకోత్సవ కార్యక్రమానికి సతీమణి అంజలితో కలిసి హాజరయ్యారు. ముంబై ధీరుభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో విద్యనభ్యసించిన సారా లండన్‌ యూనివర్సిటీ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకుంది. ఇక సచిన్ కుమారుడు అర్జున్ కూడా లండన్‌లోనే క్రికెట్‌లో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments