Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమా హాలులో కూతుర్ని అలా చూసిన తండ్రి.. చితకబాదాడు..

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో యువత పెడదోవపడుతోంది. ఈ క్రమంలో ప్రేమ వలలో యువత పడిపోతున్నారు. ఆపై మోసపోయే వారు అనేకమంది. తాజాగా గుండెలపై పెట్టుకుని పెంచిన కన్నకూతురు చేస్తున్న నిర్వాకం చూసిన తం

Advertiesment
సినిమా హాలులో కూతుర్ని అలా చూసిన తండ్రి.. చితకబాదాడు..
, సోమవారం, 27 ఆగస్టు 2018 (11:29 IST)
సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో యువత పెడదోవపడుతోంది. ఈ క్రమంలో ప్రేమ వలలో యువత పడిపోతున్నారు. ఆపై మోసపోయే వారు అనేకమంది. తాజాగా గుండెలపై పెట్టుకుని పెంచిన కన్నకూతురు చేస్తున్న నిర్వాకం చూసిన తండ్రికి ఆవేశంతో ఊగిపోయాడు. తన పెంపకానికే మచ్చ తెచ్చేలా చేసిన కూతురును, పబ్లిక్‌లోనే చితకబాదాడు. ఈ ఘటన ఆదివారంనాడు వరంగల్‌లోని ఎస్2 థియేటర్ వద్ద చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే, సదరు కూతురు తన ప్రియుడితో కలసి సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లింది. ఊహించని విధంగా అదే థియేటర్‌కు ఆమె తండ్రి వచ్చాడు. ప్రియుడితో ఉన్న కూతురును చూసిన ఆ కన్నతండ్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతావని తాము ఆశపడుతుంటే ఇలా చేస్తావా అంటూ ఫైర్ అయ్యాడు. చదువు పేరిట చేసే నిర్వాకం ఇదా? అంటూ మండిపడ్డాడు. 
 
ప్రేమికులిద్దరినీ పరుషపదజాలంతో దూషించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చుట్టుపక్కల ఉన్నవారు ఎంత చెప్పినా.. ఆయనలోని కోపం చల్లారలేదు. అందరి ముందే కన్నకూతురును చితకబాదాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డొనాల్డ్ ట్రంప్ రాసలీలలు.. పనిమనిషిని కూడా వదిలిపెట్టలేదా?