Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్‌తో క్రికెట్ సిరీస్: శిఖర్ ధావన్ స్థానంలో ఆ ఇద్దరికి చోటు?

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (12:45 IST)
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ-20 జట్టులో శిఖర్ ధావన్‌కు బదులు సంజు శాంసన్ ఎంపికయ్యాడు. అలాగే యువ క్రికెటర్ పృథ్వీ షా పరిమిత ఓవర్ల జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. 
 
కివీస్‌తో వన్డే సిరీస్‌కు 16మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో గాయం కారణంగా శిఖర్ ధావన్‌కు చోటు దక్కలేదు. టీ-20 జట్టులో శిఖర్ ధావన్‌కు బదులుగా సంజు శాంసన్, వన్డేల్లో శిఖర్‌ స్థానంలో పృథ్వీ షాలు ఎంపికయ్యారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో, చివరి వన్డే మ్యాచ్‌ సందర్భంగా శిఖర్ ధావన్‌కు గాయం ఏర్పడింది.
 
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా గాయంతో జట్టులోకి రాలేకపోయాడు. వీరిద్దరు జట్టుకు దూరమవ్వడం మినహా ఆసీస్‌తో ఆడిన టీమిండియా జట్టులో ఎలాంటి మార్పు లేదు. బౌలింగ్‌లో భారత్ మెరుగ్గా వుంది. బూమ్రా, షమీ, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాగూల్ అనే నలుగురు ఫాస్ట్ బౌలర్లున్నారు. 
 
ఇక రవీంద్ర జడేజా, శివమ్ దుబే అనే ఇద్దరు ఆల్‌రౌండర్లను కలిగివుంది టీమిండియా. శిఖర్ ధావన్ లేకపోవడంతో కేఎల్ రాహుల్ టీ20, వన్డే మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మతో కలిసి బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. ఇకపోతే.. టీమిండియా నెలపాటు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. 
 
ఐదు ట్వంటీ-20 పోటీలు ఆడనుంది. ఇందులో తొలి మ్యాచ్ జనవరి 24వ తేదీ అక్లాండ్‌లోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. కివీస్‌తో జరిగే తొలి రెండు టీ-20 మ్యాచ్‌లు అక్లాండ్‌లోనూ, ఆపై జరిగే రెండు మ్యాచ్‌లు హామిల్టన్, వెల్లింగ్టన్‌లో జరుగుతాయి. ఫిబ్రవరి 2వ తేదీ ఓవల్ మైదానంలో ఐదో టీ-20 జరుగతుంది. ఈ ఐదు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌కు తర్వాత మూడు వన్డే పోటీల సిరీస్ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగనుంది. 
 
టీమిండియా టీ-20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివం దుబే, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ సాహల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాగూర్. 
 
టీమిండియా వన్డే జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివం దుబే, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ చాహెల్, రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాగూర్, కేదార్ జాదవ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments