బాహుబలి రికార్డ్ బ్రేక్... అల వైకుంఠపురంలో అదుర్స్

సోమవారం, 13 జనవరి 2020 (11:06 IST)
అల వైకుంఠపురంలో సినిమా రికార్డులను బ్రేక్ చేస్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తాజాగా వచ్చిన ''అల వైకుంఠపురములో'' సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీసును షేక్ చేస్తోంది.

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా రెండు రాష్ట్రాల్లోతోపాటు అటూ ఓవర్సీస్‌లో కూడా ఇరగదీస్తోంది. ముఖ్యంగా న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా కనివిని ఎరుగని కలెక్షన్స్‌ను రాబడుతోంది. 
 
అక్కడ మూడు ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 34,625 డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ఫిల్మ్ క్రిటిక్ రమేష్ బాలా అభిప్రాయపడ్డారు.
 
అంతకుముందు ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ ప్రీమియర్ షోలకు న్యూజిల్యాండ్‌లో 21,290 డాలర్లు మాత్రమే రాబట్టాయి. మరోవైపు ఒకరోజు ముందే విడుదలైన సరిలేరు నీకెవ్వరు అమెరికా ప్రీమియర్ కలెక్షన్స్‌ని అల వైకుంఠపురంలో క్రాస్ చేసింది. అక్కడ ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే అమెరికా, న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా కలెక్షన్స్‌తో అదరగొడుతోంది.  

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మహేష్ "సరిలేరు నీకెవ్వరు"