అల... వైకుంఠపురములో సామజవరగమన పాట నచ్చలేదు అని కాదు కానీ..?

శనివారం, 11 జనవరి 2020 (13:31 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందిన భారీ చిత్రం అల.. వైకుంఠపురములో. బన్నీ, పూజా హేగ్డే జంటగా నటించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

ఈ సినిమాలోని పాటలన్నీ సక్సస్ సాధించడం... ఈ సినిమా సంక్రాంతికి వస్తుండడంతో సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ మూవీ గురించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేసాడు.
 
ఇంతకీ త్రివిక్రమ్ ఏం చెప్పారంటే... అల .. వైకుంఠపురములో సినిమా టైటిల్ అనుకోగానే ఆడియన్స్ ఎలా ఫీలవుతారు. మనకు సంబంధం లేని టైటిల్ అనేస్తారా..? అని భయపడ్డాను. ఎందుకంటే పోతన గారి పద్యం భాగవతంలోని ఒక లైన్ కదా... అందుకని భయపడ్డాను. కానీ.. బన్నీచాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. ఇది ఖచ్చితంగా  పెట్టేయాల్సిన టైటిల్ అని ఫిక్స్ అయిపోయాడు. ఆ రియాక్షన్ మాత్రం అసలు ఊహించలేదు.
 
టైటిల్ లో ఉన్న సీక్రట్ గురించి చెబుతూ... మనం ఎవరికైనా ఒక స్ధానాన్ని అయితే.. కల్పించగలం. అది మన చేతులో ఉండే పని. ఆ స్ధానాని తగ్గట్టుగా వాడు ప్రవరిస్తాడా..?  లేదా..? అనేది వాళ్లకు సంబంధించిన విషయం. అది చెప్పేదే అల.. వైకుంఠపురములో టైటిల్ అని చెప్పారు.

ఇక పాటల గురించి  చెబుతూ.. సామజవరగమన పాట చేసాం. అయితే...  ఆతర్వాత మాకే భయమేసి ఇంకో పాట చేసాం. బన్నీకి కూడా చెప్పలేదు. తమన్ తో కలిసి సేఫ్టీకి ఇంకో పాట చేసాం. అయితే... సామజవరగమన చాలా బాగుంది అని అందరూ బలంగా చెప్పడంతో ఆ పాటనే ఫైనల్ చేసాం. 
 
సామజవరగమన పాట నచ్చలేదు అని కాదు కానీ... ఒకసారి ఏంటంటే... మరి క్లాసికల్‌గా వెళ్లిపోతున్నామా..? ఏం పట్టించుకోవడం లేదా..? మరీ.. అంత తెగింపు మంచిదేనా..? అని ఆలోచనలోంచి సేఫ్టీ సాంగ్ చేసాం. సినిమా ఎలా ఉంటుంది అని చెప్పాలంటే.. ఫస్టాఫ్ ఇలా ఉంటుంది. సెకండాఫ్ ఇలా ఉంటుంది అని కాకుండా డిఫినెట్ గా ఇది ఎంటర్ టైనర్. ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా బలంగా ఎంటర్ టైనర్ గా ఉంటుంది అన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మహేష్ ఫ్యాన్స్‌కు ముందే సంక్రాంతి.. "సరిలేరు నీకెవ్వరు" రివ్యూ