లసిత్ మలింగ హ్యాట్రిక్.. 4 బంతుల్లో 4 వికెట్లు

శనివారం, 7 సెప్టెంబరు 2019 (18:44 IST)
శ్రీలంక వెటరన్ పేసర్ లసిత్ మలింగ అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కివీస్‌తో జరిగిన మూడు ట్వంటీ-20లో మలింగ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్‌లో ఒకేసారి నాలుగు స్థానాలు ఎగబాకాడు. దీంతో 41వ స్థానంలో ఉన్న మలింగ 21వ స్థానంలో నిలిచాడు. 
 
శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో మలింగ మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆప్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఆరు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత్ నుంచి టాప్-10లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానం కైవసం చేసుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో కుల్దీప్‌ యాదవ్ 8వ స్థానంలో నిలిచాడు.
 
మరోవైపు బ్యాట్స్‌మెన్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ క్రికెటర్ బాబర్‌ అజాం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక, టీమిండియా కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలు టాప్‌-10లో నిలిచారు. రాహుల్‌ 7వ స్థానంలో నిలవగా, రోహిత్‌ 9వ స్థానంలో నిలిచాడు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హేయ్‌ డేవిడ్‌ వార్నర్‌.. నువ్వొక చీటర్.. వావ్ అంటూ నవ్వుతూ..? (video)