సిక్స్ కొట్టడమంటే సామాన్యం కాదు. కొంతమంది ఆటగాళ్లు చాలా సామాన్యంగా కనబడుతుంటారు కానీ కొట్టడం బిగిన్ చేస్తే అవతలి జట్టు చిత్తుచిత్తు అవాల్సిందే. న్యూజీలాండుతో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మళ్లీ హ్యాట్రిక్ సిక్సర్లు 6-6-6 తో మెరుపులు మెరిపించాడు. ఇలాంటి ఫీట్లు ఇంగ్లాండ్ వేదికగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ చూపించాడు. కాకపోతే అప్పుడు పాకిస్థాన్ స్పిన్నర్లపై రెండుసార్లు హ్యాట్రిక్ సిక్సర్లతో విజృంభించాడు.
ఇక తాజాగా చూస్తే న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో 22 బంతుల్లోనే 2x4, 5x6 ఉతికి 45 పరుగులు పిండేశాడు. న్యూజిలాండ్ స్పిన్నర్ ఆస్లే వేసిన 47వ ఓవర్‌లో మొదటి బంతికి పరుగు తీయని పాండ్యా ఆ తర్వాత వరుసగా మూడు బంతులను 6-6-6గా మలిచాడు.
ఇలా హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం పాండ్యా కెరీర్లో సాధారణంగా మారింది. అందుకే పాండ్యా వస్తున్నాడంటే అవతలి జట్టువారు పోసుకుంటారు అంతే.